»   » ప్లీజ్..వివాదం చేయద్దు... : విశాల్

ప్లీజ్..వివాదం చేయద్దు... : విశాల్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై : తనకు వివాదాలు కొని తెచ్చుకోవటం ఆసక్తి లేదని విశాల్ స్పష్టం చేసారు. విశాల్ నటించిన తాజా చిత్రాల్లో ఈ తరాన్నే కాకుండా పాతతరం ప్రేక్షకుల్ని కూడా బాగా ఆకట్టుకుంటున్న చిత్రం 'ఎంజీఆర్'. అందుకు పురట్చితలైవర్ ఎంజీఆర్ పేరు పెట్టడమే కారణం. అయితే తను నటించిన చిత్రాల్లో 'ఎంజీఆర్' చిత్రమే లేదంటున్నారు విశాల్. అంతేగాక... తాను 'మదగజరాజా' చిత్రంలో నటించానని, టైటిల్‌ని కుదించి అందరూ 'ఎంజీఆర్' అంటూ పిలుస్తున్నారని వివరణ ఇచ్చారు. ఆ పేరు ఎంతో శక్తివంతమైందని, 'ఎంజీఆర్' టైటిల్ కారణంగా అనవసర వివాదాలు కొనితెచ్చుకోవాలనుకోవడం లేదని అన్నారు.

  'మదగజరాజా' టైటిల్‌తోనే ప్రమోషన్స్ చేస్తున్నామని చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాల్ చెప్పారు. సుందర్.సి దర్శకత్వంలో విశాల్, వరలక్ష్మి శరత్‌కుమార్, అంజలి హీరోహీరోయిన్లుగా నటించిన 'మదగజరాజా' సెప్టెంబర్ 6వ తేదీన విడుదల కానుంది. జెమిని ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల చాలాకాలంగా విడుదలకు నోచుకోలేదు. దీంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విశాల్ సొంతంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు.

  Don't promote Madha Gadha Raja as MGR: Vishal

  విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై 'మదగజరాజా'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. గ్రామీణ నేపథ్యంలో కూడిన ఈ చిత్రాన్ని తనదైన శైలిలో పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించారు దర్శకుడు సుందర్.సి. ఆయనపై నమ్మకంతోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధపడ్డారు విశాల్. సినిమా చాలా బాగా వచ్చిందని, ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందన్న నమ్మకం వుందని విశాల్ చెప్పారు. 'మదగజరాజా' చిత్రాన్ని 'నటరాజ దానే రాజ' పేరుతో వినాయక చవితి రోజున తెలుగులోనూ ఒకేసారి విడుదల చేయనున్నారు.

  విశాల్ చెప్తూ... 1980లో రజనీకాంత్ రాజాధిరాజా, కమలహాసన్ సకలకళా వల్లభన్ తరహాలో చిత్రం చేయాలని దర్శకుడు సుందర్.సి, నేను భావించాం. అలాంటి పుల్ జాయ్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ఈ మదగజరాజా. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ అంటూ అన్ని జనరంజక అంశాలున్న చిత్రమిది. ఊటీలో కేబుల్ ఆపరేటర్‌గా నటిం చాను. ఆ పాత్ర ఎదుర్కొన్న సంఘటనల సమాహారమే చిత్రంఅన్నారు. సుందర్‌.సి మాట్లాడుతూ.. యాక్షన్‌, హాస్యం కలగలసిన చిత్రమిది. విశాల్‌కు తగ్గ కథ. ఇందుకోసం ఆయన చాలా రకాల ఆహారాలు కూడా మానేశారు. చాలా శ్రమించి నటించారని చెప్పారు.


  ఇక నయనతార హీరోయిన్ గా నటించిన 'సెల్యూట్ 'లో విశాల్‌ తొలిసారిగా ఆరుపలకల దేహంతో కనిపించారు. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు మళ్లీ అదే దేహధారణతో తెరపైకి రానున్నాడు. సిక్స్ ప్యాక్ కు మారటంపై విశాల్‌ మాట్లాడుతూ... అందరూ మాట్లాడుకునేందుకు నేను ఇలా చేయడం లేదు. అందుకు ప్రధాన కారణం కథే. 'సత్యం'కు అలాంటి శరీరాకృతి అవసరమైంది. ఇప్పుడు 'మదగజరాజ'కు కూడా అవసరమైంది. ఇందుకోసం చాలా శ్రమించాల్సి ఉంటుంది. నెలల కొద్దీ వ్యాయామం చేస్తేనే అలాంటి ఆకృతి వస్తుంది. ఆహారపదార్థాల నియంత్రణ చాలా ముఖ్యం. సిక్స్‌ప్యాక్‌తో శరీరంలో నీటిశాతం తగ్గిపోతుంది. ఇతర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని చెప్పాడు.

  English summary
  "I have been hearing people using the abbreviated version of the title. I want to reiterate that the film is titled Madha Gadha Raja and not MGR. We don't want to attract controversy and therefore I urge everyone to stop using the abbreviated title," Vishal told IANS.Madha Gadha Raja, also featuring Anjali, Varalakshmi, Sada, Santhanam and Sonu Sood in important roles, has been dubbed in Telugu as Nataraja Thaney Raja and will simultaneously released along with its Tamil version.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more