»   » ధూమ్ 3: చట్ట విరుద్ధంగా ప్రదర్శిస్తే చర్యలు

ధూమ్ 3: చట్ట విరుద్ధంగా ప్రదర్శిస్తే చర్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూఢిల్లీ: అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా ప్రధాన పాత్రల్లో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన 'ధూమ్-3' చిత్రం చట్ట విరుద్దంగా ప్రదర్శించే కేబుల్ ఆపరేటర్లకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లపై చర్యలు తీసుకుంటామని ఢిల్లీ హై కోర్టు ముందస్తు ఆదేశాలు జారీ చేసింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈచిత్రం డిసెంబర్ 20న విడుదలకు సిద్ధం అవుతోంది.

ధూమ్, ధూమ్-2 చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'ధూమ్-3' చిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఈచిత్రంలో నటిస్తుండటం కూడా మరో కారణం. భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే సాహసాలు ఈచిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి.

ధూమ్ చిత్రం మొదటి భాగంలో జాన్ అబ్రహం నటించగా....దానికి సీక్వెల్ గా వచ్చి ధూమ్-2 చిత్రంలో హృతి రోషన్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ 'ధూమ్-3' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు.

అమీర్ ఖాన్, కత్రినా కైఫ్‌లపై చిత్రీకరించిన ఓ పాటకు ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చు పెట్టారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఓ పాటకు ఇంత ఖర్చు పెట్టడం ఇదే తొలిసారి. కత్రినా, అమీర్‌లపై చిత్రీకరించిన ఈ పాటలో 200 మంది జిమ్నాస్టిక్ కళాకారులను అమెరికా నుంచి తీసుకొచ్చారట. కళ్లు చెదిరేలా వేసిన సెట్లో 20 రోజుల పాటు ఈ పాట చిత్రీకరించారని, సినిమాకు ఈ పాట హైలెట్ అవుతుందని అంటున్నారు.

English summary
The Delhi High Court Monday asked cable operators and internet service providers not to illegally show upcoming Bollywood movie "Dhoom 3".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X