»   » మంచు లక్ష్మి ‘దొంగాట’ వాయిదాకి కారణం అదే!

మంచు లక్ష్మి ‘దొంగాట’ వాయిదాకి కారణం అదే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు లక్ష్మి-అడవి శేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘దొంగాట' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయి మే 1న విడుదల అంతా సిద్ధమైంది. అయితే తాజాగా ఈ చిత్రం విడుదల వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పలు పెద్ద సినిమాలు మే మొటి వారంలో విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఎప్పుడు విడుదల చేస్తారనేది త్వరలో ప్రకటించనున్నారు.

మంచు లక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమాకు గౌతమ్ మీనన్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మంచు లక్ష్మి చిట్టి కూతురు విద్యా నిర్వాణ సమర్ఫణలో విడుదలవుతోంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.


Dongata release date postponed

కింగ్ నాగార్జున, మాస్ మహారాజ్ రవితేజ, రానా దగ్గుబాటి, నాని, తమిళ హీరో శింబు, తాప్సీ తదితరులు ఓ పాటలో సందడి చేయనున్నారు. ‘దొంగాట' సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెప్తుంది. సాధారణంగా హిందీలో ఎక్కువ ఈ తరహ ట్రెండ్ కనిపిస్తుంది. మన తెలుగులో మొదలవడం సంతోషించదగ్గ అంశం.

English summary
Lakshmi Manchu’s forthcoming film ‘Dongata’ will hit the screens on May 1st. But, now it seems the film’s release date has been pushed ahead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu