»   »  బ్రోతల్ హౌస్ లో అంతా హాట్ గా ఉంటారు, నా సంగతి అడగొద్దు : హీరోయిన్ సమాధానం

బ్రోతల్ హౌస్ లో అంతా హాట్ గా ఉంటారు, నా సంగతి అడగొద్దు : హీరోయిన్ సమాధానం

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన డర్టీ పిక్చర్ సినిమాలో విద్యాబాలన్ ఎంత గ్లామర్ షో చేసిందో తెలిసిందే. ఆ సినిమాకు గానూ విద్యాబాలన్‌కు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ డర్టీ పిక్చర్ భామ మరో హాట్ చిత్రంలో నటించబోతోంది. ఆ చిత్రం పేరు 'బేగం జాన్'. ఈ సినిమాలో ఓ బ్రోతల్ హౌస్‌కు యజమానురాలిగా కనిపించబోతోంది విద్యాబాలన్. దేశ విభజన సమయంలో కొందరు బెంగాలీ వేశ్యల జీవితం ఇతివృత్తాంతంగా రూపొందిన చిత్రం 'బేగం జాన్'.

రాణి లక్ష్మీబాయి, రజియా సుల్తాన్‌, మీరాబాయి తదితరుల స్ఫూర్తితోనే బేగం జాన్‌ పాత్రను రూపకల్పన చేయడం జరిగిందట. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన 'బేగం జాన్‌' చిత్రం బెంగాలీ మూవీ 'రాజ్‌కహిని' ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కుతోంది. వేశ్యా గృహానికి చెందిన 11 మంది మహిళల జీవన కథనమే 'బేగం జాన్‌..

Dont ask me About My Hot Look said Vidhya Baklan

ఈ చిత్రంలో నటించటానికి ప్రధాన కారణం బేగం జాన్‌ వ్యక్తిత్వం. వేశ్యా గృహంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనే క్రమంలో బేగం జాన్‌ ధైర్యసాహసాలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. రాణి లక్ష్మీబాయి, రజియా సుల్తాన్‌, మీరా బాయి వంటి హేమా హేమీల యాటిట్యూడ్‌ని స్ఫూర్తిగా తీసుకుని బేగం జాన్‌ పాత్రను మరింత బలోపేతం చేశారు.

ఇటువంటి చిత్రంలో నటించటం చాలా ఆనందంగా ఉంది' అంటూ చెప్పిన విధ్యా అసలు ఈ సినిమాలో ఎలా ఉండబోతోందీ అన్న విషయం లో క్లారిటీ ఇస్తూ వదిలిన ఫస్ట్ లుక్ పొస్టర్ ఒక్కసారి బాలీవుడ్ ని ఊపేసింది.. ఈ స్టిల్ లో విద్యా హుక్కా తాగుతూ మంచం మీద పడుకొని ఉన్న స్ట్ల్ చూసి చిన్న పాటి షాక్ తిన్నారు జనాలు...

Dont ask me About My Hot Look said Vidhya Baklan

దీంతో సినిమాపై క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది. బ్రోతల్ హౌస్ ఓనర్‌గా కనిపిస్తున్న విద్యాబాలన్ సినిమాలో మరింత హాట్‌గా కనిపిస్తుందా? అనే ప్రశ్నలు మొదలైపోయాయి.. అంతే కాదు ఇదే ప్రశ్న విధ్యా దగ్గరకూ వెళ్ళింది. ఈ విద్యాబాలన్ ఏం సమాధానం చెప్పిందో తెలుసా.. ''బ్రోతల్ హౌస్‌లోని బ్రోతల్స్ హాట్‌గా ఉంటారు.

కానీ, ఓనర్ హాట్‌గా ఉండాలన్న రూలేం లేదు కదా. సినిమాలో నేను హాట్‌గా ఉన్నానా? లేదా? అనేది నన్ను అడగొద్దు. అది ప్రస్తుతానికి సస్పెన్స్'' అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలు ఎలా ఉన్నా.. బాలీవుడ్ వర్గాలు మాత్రం డర్టీపిక్చర్‌లో ఎంత గ్లామర్‌ను ఒలకబోసిందో ఇప్పుడూ అంతే గ్లామరస్‌గా కనిపిస్తుందని చెబుతున్నాయి. మహేశ్ భట్, ముఖేశ్ భట్ నిర్మాణ సారథ్యంలో శ్రీజిత్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది.

English summary
Balan plays the title role of the madam of a brothel in the film Begum Jaan and She shared About her charector in this Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu