»   »  గాయకులను అవమానపరచకండి :బాలు

గాయకులను అవమానపరచకండి :బాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
MM Keervani
"కళాకారులను డబ్బుతో కొనలేరు ...పాట పాడిన అనేక మంది వెళ్ళి మార్కెట్ లో క్యాసెట్ కొంటే అతని పేరు లేకుండా గాయకుడుగా వేరే వ్యక్తుల పేర్లు ఉంటున్నాయి. ఒక పాట ఒవరిచేత పాడిస్తే బాగుంటుందో ముందే నిర్ణయించుకుని పాడించుకోండి. పాడించిన తర్వాత డబ్బులిచ్చాం కదా అంటూ గాయకున్ని అవమానపరచకండి ..లేదా ముందే ట్రాక్ పాడిస్తున్నామని చెప్పండి " అంటూ ఆవేదన వెళ్ళబుచ్చారు ప్రముఖ గాయకుడు ఎస్పీబాల సుబ్రమణ్యం. నిన్న ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన 'పాండు రంగడు' సినిమా డబుల్ ప్లాటినం డిస్క్ వేడుకలో కొద్దిసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది. చాలా రోజలు తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన తన మనసులోని మాటలను వెల్లడించారు. ఎవరేమనుకున్నా ఫర్వాలేదంటూ కాస్త తీవ్రంగానే స్పందించారు.

బాలు ప్రసంగం ముగిసిన తరువాత మాట్లాడిన సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆయనని క్షమాపణ కోరారు. తెలిసి చేసినా ...తెలియక చేసినా,మనస్సునొప్పించి ఉన్నా తనను క్షమించాలంటూ బాలుని కోరారు. సంగీతానికి,సాహిత్యానికి నిచ్చనలా ఉన్న బాలుగారిని తెలిసి కూడా బాథపెట్టానని అలాగే అహంకావచ్చు ఇతర కారణాలు కావచ్చు... పితృసమానులైన రాఘవేంద్రరావుగారిని కూడా ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని కోరుకుంటున్నానని అన్నారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి గారి వద్ద పని చేస్తూ నాన్నగారు అని పిలిచే తాను రెమ్యునేషన్ సరిపోలేదని చెప్పకుండా మానేసి ఆయన్ని మానసిక వేదనకు గురి చేసానంటూ కీరవాణి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X