»   » 'దూసుకెళ్తా' రిలీజ్ గురించి మోహన్ బాబు

'దూసుకెళ్తా' రిలీజ్ గురించి మోహన్ బాబు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం 'దూసుకెళ్తా'. లావణ్య త్రిపాఠి నాయిక. వీరు పోట్ల దర్శకత్వం వహించారు. మోహన్‌బాబు నిర్మాత. ఈ నెల 17న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  మోహన్‌బాబు మాట్లాడుతూ ''సినిమాని చూశాను. విష్ణు నృత్యాలు, పోరాటాలు వైవిధ్యంగా అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. రవితేజ నేపథ్య గళం, మంచు లక్ష్మీ ప్రసన్న ప్రత్యేక పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీరు పోట్ల సినిమాని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు''అన్నారు.

  అలాగే... "దూసుకెళ్తా సినిమా తొలి కాపీ చూశాను. విష్ణు మంచి నటనను ప్రదర్శించాడు. ఈ సినిమాలో అతని నృత్యాలు, పోరాటాలు వైవిధ్యంగా ఉన్నాయి. ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయనే నమ్మకం ఉంది. వీరుపోట్ల టేకింగ్, రవితేజ వాయిస్ ఓవర్, మంచు లక్ష్మి స్పెషల్ అప్పియరెన్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా 600లకు పైగా థియేటర్లలో సినిమాను విడుదల చేస్తాం. ఈ సినిమాకు తప్పకుండా ప్రేక్షకాదరణ ఉంటుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు.


  లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.... ''తొలి సినిమా 'అందాల రాక్షసి'తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నాను. రెండో సినిమా అనేసరికి ఎలాంటి కథని ఎంచుకోవాలని ఆలోచనలో పడ్డాను. అయితే తొలిసినిమాకి భిన్నంగా ఉండాలి అని మాత్రం అనిపించింది. అలా నేను ఎంచుకున్న సినిమానే ఈ 'దూసుకెళ్తా'. డాక్టర్‌ అలేఖ్యగా మీ ముందుకుకొస్తున్నాను'' అన్నారు .

  వీరు పోట్ల మాట్లాడుతూ ''రవితేజ గళంతో సాగే సన్నివేశాలు ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టేలా ఉంటాయి. సినిమా ప్రారంభంలోనే ఆయన గొంతు వినిపిస్తుంది. ఇందులో విష్ణు పాత్రికేయుడిగా కనిపిస్తారు''అని తెలిపారు. ఇక ఈ చిత్రంలో రవితేజ గళం వినిపిస్తుంది. ఇందులో కథానాయకుడి పాత్ర చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడిగా ఎదిగే నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. అవి ఆద్యంతం సరదాగా సాగుతాయట. ఆ సన్నివేశాలకి రవితేజ గళాన్ని అందించారు.


  వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, పంకజ్ త్రిపాఠి, పోసాని, రఘుబాబు, భరత్, అన్నపూర్ణమ్మ, రజిత, సురేఖావాణి, హేమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:సర్వేష్ మురరి, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:ఆర్.విజయకుమార్.

  English summary
  Producer Mohan Babu said that he is planning to release Doosukeltha starring his son Manchu Vishnu and Lavanya Tripati in about 600 screens. He confirmed that the film would hit the screens worldwide on October 17th. Veeru Potla has directed the film and it was cleared by Censor Board with U/A certificate.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more