»   » ‘దూసుకెళ్తా’విడుదల ఫోస్ట్ ఫోన్

‘దూసుకెళ్తా’విడుదల ఫోస్ట్ ఫోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మంచు విష్ణు హీరోగా వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దూసుకెళ్తా'. లావణ్య త్రిపాఠి హీరోయిన్. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై డా.మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఆరియానా- వివియానా సమర్పకులు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం విజయదశమి కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయ పరిస్ధితులు మారిన నేపధ్యంలో దాన్ని అక్టోబర్ 17 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అఫీషియల్ గా ప్రకటన రానుంది.

ప్రపంచ వ్యాప్తంగా విష్ణు కెరియర్‌లోనే అత్యథిక థియేటర్‌లలో భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఢీ, దేనికైనా రెడీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాల తరువాత అదే తరహాలో విష్ణు నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. వీరూ పోట్ల డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం లో మంచు విష్ణు పాత్రకేయుడుగా కనిపిస్తారు. అలాగే డాక్టర్‌ అలేఖ్యగా లావణ్య కనిపిస్తుంది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఆమె చాలా ఎక్సైటింగ్ గా ఉంది.

లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.... ''తొలి సినిమా 'అందాల రాక్షసి'తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నాను. రెండో సినిమా అనేసరికి ఎలాంటి కథని ఎంచుకోవాలని ఆలోచనలో పడ్డాను. అయితే తొలిసినిమాకి భిన్నంగా ఉండాలి అని మాత్రం అనిపించింది. అలా నేను ఎంచుకున్న సినిమానే ఈ 'దూసుకెళ్తా'. డాక్టర్‌ అలేఖ్యగా మీ ముందుకుకొస్తున్నాను'' అన్నారు .


వీరు పోట్ల మీడియాతో మాట్లాడుతూ ''రవితేజ గళంతో సాగే సన్నివేశాలు ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టేలా ఉంటాయి. సినిమా ప్రారంభంలోనే ఆయన గొంతు వినిపిస్తుంది. ఇందులో విష్ణు పాత్రికేయుడిగా కనిపిస్తారు''అని తెలిపారు. ఇక ఈ చిత్రంలో రవితేజ గళం వినిపిస్తుంది. ఇందులో కథానాయకుడి పాత్ర చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడిగా ఎదిగే నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. అవి ఆద్యంతం సరదాగా సాగుతాయట. ఆ సన్నివేశాలకి రవితేజ గళాన్ని అందించారు.

వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, పంకజ్ త్రిపాఠి, పోసాని, రఘుబాబు, భరత్, అన్నపూర్ణమ్మ, రజిత, సురేఖావాణి, హేమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:సర్వేష్ మురరి, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:ఆర్.విజయకుమార్.

English summary
Manchu Vishnu starrer Doosukeltha has been postponed to October 17th. The film was to hit the screens on 11th October on the occasion of Dussera festival. But the current situation in Andhra Pradesh is not conducive for films to get a smooth release. Hence the movie backed off from its original plan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu