»   » ఆ హీరోల దోస్తానా కంటిన్యూ చేస్తున్నారు

ఆ హీరోల దోస్తానా కంటిన్యూ చేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కరుణ్ జోహార్ నిర్మాణంలో ఆ మధ్య వచ్చి హిట్టయిన దోస్తానా చిత్రంకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ సారి కూడా అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహమ్ లు ఈ చిత్రంలో మగ జంటగా చేస్తున్నారు. అయితే హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఉండకపోవచ్చునని తెలుస్తోంది. మొదటి చిత్రంలాగానే ఇది కూడా మిస్ అండర్ స్టాండిగ్స్ మధ్య నడిచే కామిడీగా తెరకెక్కుతుందని కరణ్ చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ఈ వేసవిలో షూటింగ్ మొదలవుతుంది. ఈ విషయాలను కరణ్ తన ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు. ఇక కరణ్ జోహార్ తన లేటెస్ట్ చిత్రం మై నేమ్ ఈజ్ ఖాన్ హిట్టుతో చాలా సంతోషంగా ఉన్నారు. తమ ధర్మా ప్రొడక్షన్స్ లో వరసగా సినిమాలు చేస్తాను అంటున్నారు. ఇక ప్రస్తుతం కరుణ్ దృష్టి మొత్తం స్టెప్ మామ్ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంపైనే ఉంది. కాజల్,కరీనా కపూర్, అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో చేస్తున్నారు. ఈ కథతో మన తెలుగులో జగపతి బాబు, ఆమనిలతో ఎస్వీ కృష్ణారెడ్డి మావిచిగురు అనే చిత్రం రూపొందించి హిట్ కొట్టారు. అలాగే ఇదే ప్రొడక్షన్స్ పై ఇమ్రాన్ ఖాన్, సోనం కపూర్ కాంబినేషన్ లో వస్తున్న ఐ హేట్ లవ్ స్టోరీస్ అనే చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu