»   »  శంకర్ ‘రోబో-2’ ప్రీ ప్రొడక్షన్ లాస్ ఏంజిల్స్‌లో (ఫోటో)

శంకర్ ‘రోబో-2’ ప్రీ ప్రొడక్షన్ లాస్ ఏంజిల్స్‌లో (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రోబో చిత్రానికి సీక్వెల్‌గా రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘రోబో-2' రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దర్శకుడు శంకర్ తన కోర్ టీమ్ తో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో పర్యటిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలతో టై అప్ అయి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ. 240 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

 A Double Treat For Superstar Fans On December 12th

ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నల్డ్ ష్వార్జ్ నెగ్గెర్ నటిస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా లాంచింగ్ సందర్భంగా దర్శకుడు శంకర్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఏది ఏమైనా రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా రోబో-2 లాంచ్ కావడం అభిమానులకు డబుల్ ట్రీట్ అనిచెప్పొచ్చు.

Robo 2

దర్శకుడు శంకర్ గానీ, సూపర్ స్టార్ రజనీ కానీ ఇప్పటివరకూ ఒక్క ముక్క కూడా రోబో 2 గురించి అఫీషియల్ గా మాట్లాడలేదు. అయినా వార్తలు మాత్రం ఆగటం లేదు. అఫిషీయల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేలోగా ఈ చిత్రం గురించి వచ్చే వార్తలతో ఓ పుస్తకం వేసేయచ్చు అని సినీ వర్గాల్లో వినపడుతోంది. తాజాగా ఈ చిత్రంలో విలన్ గా రజనీకు ఆపోజిట్ గా హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్నాల్డ్ ఈ ప్రాజెక్టు ఓకే చేయటానికి కొన్ని కండీషన్స్ పెట్టినట్లు సమాచారం.

English summary
With superstar Rajinikanth's birthday just a couple of weeks away, fans and movie lovers are anticipating some mind-boggling news pertaining to Enthiran 2, as it is widely believed that the official press meet, revealing the complete cast and crew of the upcoming sci-fi film, will be held on December 12th.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu