twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టూడియోకు చేరుకున్న రామానాయుడు అంతిమయాత్ర

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు అంతిమయాత్ర ఆయన నివాసం నుంచి రామానాయుడు స్టూడియోకు చేరుకుంది. రామానాయుడు భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఈరోజు మధ్యాహ్నం వరకు రామానాయుడు స్టూడియోలో ఉంచనున్నారు. మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామానాయుడు పార్థీవ దేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు, సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
    ప్రముఖ సినీ నిర్మాత, మూవీమొఘల్‌ డాక్టర్‌ రామానాయుడు అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం తర్వాత రామానాయుడు స్టూడియోలో నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో రామానాయుడు పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

    మూవీ మొఘల్‌ రామానాయుడు పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం రామానాయుడు స్టూడియోకు తీసుకువచ్చారు. రామానాయుడు నివాసం నుంచి ఆయన పార్థివదేహాన్ని అంతిమయాత్రగా స్టూడియోకు తీసుకువచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రామానాయుడు భౌతికకాయాన్ని ఉంచే అవకాశం ఉంది.

    రామానాయుడిని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మధ్యాహ్నం 3 తర్వాత రామానాయుడు స్టూడియోలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం అత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రామానాయుడు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

    Dr. D Ramanaidu Last Journey

    శతాధిక చిత్రాల నిర్మాత... మూవీ మొఘల్‌గా పేరుగాంచిన దగ్గుబాటి రామానాయుడు (79) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం 2.30గంటలకు హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాసవిడిచారు. ఆయనకిభార్య రాజేశ్వరితో పాటు ఇద్దరు కుమారులు సురేష్‌బాబు, వెంకటేష్‌, కుమార్తె లక్ష్మి ఉన్నారు.

    పెద్ద కుమారుడు డి.సురేష్‌బాబు ప్రముఖ నిర్మాతకాగా, చిన్న కుమారుడు వెంకటేష్‌ అగ్ర కథానాయకుడుగా పేరు తెచ్చుకొన్నారు. మనవళ్లు రానా, నాగచైతన్యలు కూడా కథానాయకులుగా రాణిస్తున్నారు. రామానాయుడికి 13 ఏళ్ల క్రితం ప్రొస్టేట్‌ గ్రంథి కేన్సర్‌ ఉన్నట్లు తేలటంతో అమెరికాలో చికిత్స పొందారు. ఇటీవల మళ్లీ సమస్య తలెత్తటంతో హైదరాబాద్‌, బెంగళూరు వైద్యుల వద్ద చికిత్స పొందారు. కేన్సర్‌ను జయించి క్షేమంగా బయటపడతారని ఆశిస్తుండగా బుధవారం మృతిచెందారు.

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌, గవర్నర్లు నరసింహన్‌, కె.రోశయ్య, సీహెచ్‌. విద్యాసాగరరావు తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రామానాయుడు మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం 9.30 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని ఇంటి నుంచి అంతిమయాత్ర మొదలై రామానాయుడు స్టూడియోకి చేరుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచి తర్వాత అంత్యక్రియలు జరపనున్నట్లు రామానాయుడి తనయుడు వెంకటేష్‌ తెలిపారు.

    రామానాయుడు మృతికి సంతాపంగా తెలుగు సినీ పరిశ్రమలోని అన్ని విభాగాలు గురువారం కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు దర్శక నిర్మాత దాసరి నారాయణరావు, మా అధ్యక్షులు మురళీమోహన్‌ ప్రకటించారు. సినిమా షూటింగ్‌లు, రికార్డింగ్‌లతోపాటు అన్ని విభాగాలు ఇందులో పాల్గొంటాయన్నారు. థియేటర్లు, మల్టీప్లెక్సులు సైతం మూసివేస్తారన్నారు.

    English summary
    The final rites of Producer Dr. Ramanaidu will be performed by the family after 3pm today. The body will be placed in Ramanaidu Studios from 9am today (19th Feb) for public visit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X