»   » జాకీ చాన్‘డ్రాగన్ బ్లేడ్’ ట్రైలర్ అదిరింది (వీడియో)

జాకీ చాన్‘డ్రాగన్ బ్లేడ్’ ట్రైలర్ అదిరింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరైన ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీ చాన్ త్వరలో మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చైనీస్ బాషలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే అక్కడ భారీ వసూళ్లు సాధించింది.

తాజాగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీషుతో పాటు ఇతర బాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంగ్లీష్ ట్రైలర్ విడుదలైంది. హాలీవుడ్ మార్కెట్లో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా జాకీ చాన్ సినిమాలు తెలుగులో కూడా అనువాదం అవుతుంటాయి. ఈ చిత్రం కూడా తెలుగులో విడుదల కానుంది.

మన కరెన్సీ లెక్క ప్రకారం దాదాపు 400 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఈ చిత్రం చైనాలో రూ. 750 కోట్ల వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడం ద్వారా 500 నుండి 1000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. జాకీ చాన్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని సినిమాను భారీగా విడుదల చేయబోతున్నారు.

ఈ చిత్రానికి డేనియల్ లీ దర్శకత్వం వహించారు. జాకీ చాన్, జాన్ కుసక్, అడ్రియెన్ బ్రాడీ, లిన్ పెంగ్, మికా వాంగ్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనునాన్నారు.

English summary
Dragon Blade is a 2015 historical action film written and directed by Daniel Lee and starring Jackie Chan. In the film, Chan plays Huo An, the commander of the Protection Squad of the Western Regions during the Han Dynasty.
Please Wait while comments are loading...