»   » నలభై ఏళ్లు అయినా నన్ను అలాగే పిలుస్తున్నారు

నలభై ఏళ్లు అయినా నన్ను అలాగే పిలుస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: షోలేలో సినిమాలో భాగమైనందుకు తనకు చాలా గర్వంగా ఉందని బాలీవుడ్‌ నటి హేమామాలిని అన్నారు. బాలీవుడ్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమా 'షోలే' విడుదలై నేటికి నలభై ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా ఆమె ఇలా స్పందించారు. ఆమె ఏం ట్వీట్ చేసారో ఇక్కడ చూడండి.

సినిమా వచ్చి నలభై ఏళ్లయినా తనను ఇప్పటికీ షోలేలో తాను నటించిన పాత్ర పేరు 'బసంతి' అని పిలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
1975లో విడుదలైన ఈ ప్రముఖ సినిమాలో బాలీవుడ్‌ నటులు అమితాబచ్చన్‌, జయ బాధురి, హేమామాలిని, ధర్మేంద్ర, సంజీవ్‌ కుమార్‌, అజ్మద్‌ ఖాన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. రమేష్‌ సిప్పీ దర్శకత్వంలో వచ్చిన, ఇంతమంది ప్రముఖులు నటించిన ఈ సినిమాలో తాను భాగమైనందుకు గర్వంగా ఉందని హేమా మాలిని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

భారతీయ సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్ గ్రేట్ మూవీగా చరిత్రకెక్కిన సినిమా 'షోలే". ఆగస్టు 15, 9175 లో విడుదలైన ఈ సినిమా ఆగస్టు 15తో 40 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ సినిమాను జి.పి. సిప్పి నిర్మించగా....అతని కుమారుడు రమేష్ సిప్పి దర్శకత్వం వహించారు. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, హేమా మాలిని, సంజీవ్ కుమార్, జయ బాధురి, అమ్జద్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అమితాబ్ లాంటి స్టార్స్ పరిశ్రమలో సెటిలయ్యే అవకాశం కల్పించిన చిత్రం ఇదే.

Dream Girl Hemamalini tweet about Sholey

ఇప్పటి వరకు షోలేను తలదన్నే సినిమా రాలేదంటే అతిశయో‌‍క్తి కాదేమో. 36 ఏళ్ల కిందటే రూ. 3 కోట్లు వెచ్చించి భారీ తారాగణంతో నిర్మించారు. అప్పట్లో మూడు కోట్లంటే భారీ బడ్జెట్. రెండున్నర సంవత్సరాల ఎన్నోకష్టాలకు ఓర్చి షోలేనే తెరకెక్కించారు. తొలుత సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో సినిమా చూసేందుకు జనాలు పెద్దగా రాక పోవడంతో సినిమా ప్లాప్ అని అంతా నిరుత్సాహ పడ్డారు. ఆ తర్వాత షోలే ప్రభంజనం మొదలైంది. ముంబైలోని మినర్వా థియేటర్ లో షోలే ఏకంగా 286 వారాలు(5 సంవత్సరాలపైనే) నడిచి రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా 100కుపైగా థియేటర్లలో ఏకథాటిగా 25వారాలు(సిల్వర్‌జూబ్లీ) ప్రదర్శితమైంది.

ఆ తర్వాత ఈ సినిమాను 3డిలో కూడా విడుదల చేసారు. 40 ఏళ్ల క్రితం రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఇప్పటి వరకు వివిధ రూపాల్లో దాదాపు రూ. 768 కోట్లకు పైగా వసూలు చేసినట్ల అంచనా. షోలేను అనుసరిస్తూ చాలా సినిమాలు వచ్చినా ....అవి నిలవలేక పోయాయి. షోలే చిత్రీకరణ, సన్నివేశాలు, పాత్రల ఎంపిక, పాటలు, సంగీతం అన్ని భిన్నంగా, ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండటం సినిమా ప్లస్సయింది. అంతుకే అప్పటికీ ఇప్పటికే...భారతీయ సినీ ప్రపంచంలో ది గ్రేట్ మూవీ ఓన్లీ 'షోలే" అంటుంటారు సీని ప్రేమికులు.

English summary
Hemamalaini tweeted: " 40 yrs of Sholay & still going strong.So proud I was part of such an iconic movie!Ppl still call me Basanti & transport me to tht era again!"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu