twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజంద్రే ప్రసాద్ ‘డ్రీమ్’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : కైపాస్ ఫిలిం ప్రొడక్షన్స్ హౌస్ నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నిర్మించిన డ్రీమ్ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం 21న విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ అనంతరం సెన్సార్ బోర్డు చీఫ్ ధనలక్ష్మి, ఇతర సభ్యులు స్పందిస్తూ రాజేంద్ర ప్రసాద్ మరో మంచి సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారని ప్రశంసించారు.

    నిర్మాత మాట్లాడుతూ...'డ్రీమ్ సినిమా కల్ట్ జానర్‌లో నిర్మితమైన తెలుగు సినిమా. రొటీన్‌గా మనం సినిమాల్లో చూసే సన్నివేశాలు కానీ పాత్రలు కానీ లేకుండా ప్రేక్షకుల ఊహకి అందకుండా 2 గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సినిమాలోని ప్రతి సీన్‌ని అద్భుతంగా తీర్చి దిద్దడం జరిగింది. ప్రతి సీన్‌లో అంతర్థానంగా ఉన్న మిస్టరీని సెకండ్ హాఫ్‌లో చెప్పడం జరుగుతుంది' అన్నారు.

    బాధ్యతలకు, బంధాలకు దూరమైన రిటైర్డ్ మేజర్ కథతో రూపొందుతోన్న చిత్రం 'డ్రీమ్'. ఒంటరితనం ఓ వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పును తెచ్చింది? మానసికంగా మేజర్ అనుభవించిన అంతర్మథనం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం. మేజర్‌గా డా.రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. జయశ్రీ, పావనీరెడ్డి, దీప్తి ఇందులో కథానాయికలు.

    ఒరిజినల్ కథలతో ప్రేక్షకులి కొత్త దనాన్ని అందించే విధంగా ప్రతి సంవత్సరం రెండు సినిమాలని నిర్మిస్తామని కైపాస్ ఫిలిం ప్రొడక్షన్స్ హైస్ అధినేతలు తెలిపారు. . పూనమ్, వినయ్‌వర్మ, ప్రభు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవికుమార్ నీర్ల, సంగీతం: రాజేష్, ఎడిటర్: బస్వా పైడిరెడ్డి, నిర్మాణం: కైపస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్.

    English summary
    KAIPAS’ film production house first venture DREAM has completed the censor. The film was received well by the censor panel. Censor board chief Dhanalakshmi garu has praised the movie for its intellectual content. The movie is touted to be a cult thriller. Producers say, “As we proclaimed earlier, this movie falls into cult genre and does not follow the regular Telugu movie format or style. This is a special kind of intellectual movie wherein every shot has been designed for a reason which will be revealed in later stages as the movie proceeds. Technically it stands tall and matches to any universal film aesthetics. The movie also proves that budget is never a hindrance for creativity,”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X