»   » డ్రగ్స్ కేసు: ముమైత్ ఖాన్‌ అడ్రస్ తికమక, బిగ్ బాస్ ఇంటికి పోలీసులు

డ్రగ్స్ కేసు: ముమైత్ ఖాన్‌ అడ్రస్ తికమక, బిగ్ బాస్ ఇంటికి పోలీసులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్స్‌ కేసులో అనుమానాలున్న పలువురు సినీ ప్రముఖులకు పోలీసులు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దాదాపు 12 మంది సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ముమైత్ ఖాన్‌ను నోటీసులు అందించే క్రమంలో పోలీసులు కాస్త ఇబ్బంది పడుతున్నారు.

Mumaith Khan HQ Wallpapers

అందుకు కారణం ఆమె ఎక్కడ ఉంటున్నారు? అడ్రస్ ఏమిటనే వివరాలు సరిగా లేక పోవడమే. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఒక టీచర్‌ ఇంటిలో ఆమె ఉంటున్నట్లు తెలియడంతో అక్కడకు పంపారు. కానీ అక్కడ ఆమె లేకపోవడంతో నోటీసు అందలేదు. ముమైత్ ఖాన్ ముంబై అడ్రస్ కూడా పోలీసులు తెలుసుకోలేక పోయారు.

బిగ్ బాస్ షోలో ముమైత్

బిగ్ బాస్ షోలో ముమైత్

ముమైత్ ప్రస్తుతం పుణె సమీపంలో జరుగుతున్న బిగ్ బాస్ షోలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెకు నోటీసులు అందజేసేందుకు సిద్ధమయ్యారు. 21న ముమైత్ ఖాన్‌ విచారణకు హాజరు కావాల్సి ఉంది.

సాధ్యమేనా?

సాధ్యమేనా?

బిగ్ బాస్ షోలో ఒకసారి ఎంటరయ్యాక తాళం వేసేస్తారు. షో నుండి ఎలిమినేట్ అయితే తప్ప ఆ ఇంట్లో నుండి బయటకు రావడానికి వీలుండదు. అందుకు సంబంధించి నియమనిబంధనలు కూడా పక్కగా ఉంటాయి. మరి పోలీసులు బిగ్ బాస్ ఇంటి వరకు వెళ్లినా.... షో నియమనిబంధనలు బ్రేక్ చేసి ఆమెను నిర్వాహకులు బయటకు పంపిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Telugu : Sampoornesh Babu Have Elimination Threat From Big Boss Show
చట్టం కంటే టీవీ షోలు అతీతమా?

చట్టం కంటే టీవీ షోలు అతీతమా?

వినోదం కోసం నిర్వహించే టీవీ కార్యక్రమాలు.... పోలీసులు, చట్టం కంటే అతీతం కాదుకదా అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముమైత్ బిగ్ బాస్ ఇంటిని వదిలి బయటకు రావాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎవరెవరు ఏయే తేదీల్లో?

ఎవరెవరు ఏయే తేదీల్లో?

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 20న ఛార్మిని, 21న ముమైత్ ఖాన్‌ని, 22న సుబ్బ‌రాజుని, 23న కెమెరామెన్ శ్యాం కె.నాయుడుని, 24న హీరో ర‌వితేజ‌ను, 25న ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నాను, 26న న‌వ‌దీప్‌ను, 27న త‌రుణ్‌ను, 28న నందు ఆ తరువాతి తేదీకి త‌నీష్‌ను ఎక్సైజ్ శాఖ కార్యాల‌యానికి రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్ర‌తి రోజు ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఈ విచార‌ణ ప్రారంభం కానుంది.

English summary
The Tollywood is jolted with the involvement of celebrities in drugs case and the SIT has given notices to these celebrities, asking to attend for interrogation.While Mumaith Khan will be attending on 21st of July.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu