»   » యూఎస్‌లో... తప్పతాగి ఇండియన్ హీరోయిన్‌‌పై దుర్భాషలు!

యూఎస్‌లో... తప్పతాగి ఇండియన్ హీరోయిన్‌‌పై దుర్భాషలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ప్రవాస భారతీయులు జరుపుకుంటున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బాలీవుడ్ నటి రవీనా టండన్ వెళ్లారు. రెండు రోజుల పాటు జరిగిన వేడుకలు బాగానే జరిగాయి కానీ చివరి రోజు ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది రవీనా.

వేడుకల్లో చివరి రోజు వేదికపై ఉన్న తనతో నిర్వాహకుల్లో ఒకరు అసభ్యంగా ప్రవర్తించారని రవీనా ట్విట్టర్‌లో పేర్కొంది. ఆ సమయంలో అతను మధ్యం సేవించి ఉన్నాడని, తనను దుర్భాషలాడాడని రవీనా వాపోయింది. వేదిక కింద ఉన్న కొందరు వచ్చి అతనికి సద్ది చెప్పి దూరంగా తీసుకెళ్లి పోయారు అని రవీనా టండన్ వివరించింది.

Drunk man misbehaves with Raveena Tandon

ఈ సంఘటన రవీనా టండన్ ను చాలా బాధించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అతిథిగా వెళ్లిన తన పట్ల నిర్వాహకుల్లో ఒకరు ఇలా ప్రవర్తించడం జీర్ణించుకోలేక పోయింది. తన పట్ల అతను అలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందని ఆరా తీసింది.

తన పట్ల అతను ఇలా ప్రవర్తించడానికి కారణం అతని పిల్లలను ఆ కార్యక్రమానికి తన కారులో తీసుకురానందుకే అతను అలా చేశాడని తనకు తరువాత తెలిసిందని రవీనా చెప్పింది. అయితే తన కారులో పిల్లలను తీసుకురావడానికి సెక్యూరిటీ ఒప్పుకోలేదని రవీనా ట్విట్టర్‌లో తెలిపింది.

English summary
Fan misbehaves with Raveena Tandon at Independence Day event in Los Angeles.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu