బాహుబలి మైకంలో దేవిశ్రీ ప్రసాద్ చేసిన పోస్ట్... వైరల్ అయింది!

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రస్తుతం బాహుబలి ఫీవర్ ముంచెత్తిన సంగతి తెలిసిందే. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రెండు మూడు రోజులు అదే మైకంలో ఉండే పరిస్థితి.

By Bojja Kumar

హైదరాబాద్: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రస్తుతం బాహుబలి ఫీవర్ ముంచెత్తిన సంగతి తెలిసిందే. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రెండు మూడు రోజులు అదే మైకంలో ఉండే పరిస్థితి. తాజాగా ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

సినిమా చూసి మూడు రోజులైనా తనను ఇంకా ఆ మైకం వీడక పోవడంతో......ఆయన ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు ఒకటి వైరల్ అయింది. బాహుబలి సినిమాను, రాజమౌళిని ఆయన ప్రశంసించిన తీరు ఆకట్టుకుంది.

బయటకు రాలేక పోతున్నాను

బయటకు రాలేక పోతున్నాను

‘బాహుబలి-2' సినిమా చూసి మూడు రోజులైంది. సినిమా చూసాక థియేటర్ నుండి బయటకు వచ్చాను కానీ.... ఇంకా సినిమా నుండి మాత్రం బయటకు రాలేక పోయాను అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

బాహుబలి

బాహుబలి

బాహుబలి మూవీ కేవలం గ్రాండ్ గా, విఎఫ్ఎక్స్, లోకేషన్స్, భారీ బడ్జెట్ మాత్రమేకాదు. అంతకు మించిన మెస్మరైజింగ్ ఈ సినిమాలో ఉంది. అమేజింగ్ స్టోరీలైన్, ఉత్కంఠ రేపే స్క్రీన్ ప్లే, అద్భుతమైన విజువల్స్, మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్... వీటితో పాటు డైరెక్టర్ పెర్ఫెక్షన్.... అన్నీ కలిపితే ఇంత గొప్ప సినిమా మన ముందుకొచ్చింది. సినిమా చూస్తున్న సమయంలో ఎన్ని సార్లు అరుస్తూ, చప్పట్లు కొట్టానో నాకే తెలియదు అని దేవిశ్రీ తెలిపారు.

బిగ్ డ్రీమ్

బిగ్ డ్రీమ్

నువ్వు ఎవరు? ఎక్కడిని నుండి వచ్చావు అనే దానితో సంబంధం లేకుండా బాగా కష్టపడితే నీ పెద్ద కలలు సాకారం అవుతాయి... అనడానికి బాహుబలి మూవీ లైవ్ ఎగ్జాంపుల్. అలాంటి పెద్ద కలను సాకారం చేసుకున్న రాజమౌళి సార్ కు హాట్సాఫ్. చాలా మంది ఇలాంటి పెద్ద కలలు కనడానికి కూడా సాహసించరు.... అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చారు.

దేవిశ్రీ ప్రసాద్

బాహుబలి-2 సినిమా గురించి దేవిశ్రీ ప్రసాద్ ఎఫ్.బిలో పెట్టిన పోస్టు ఇదే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X