»   » అదీ దేవిశ్రీ ప్రసాద్ అంటే: చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్

అదీ దేవిశ్రీ ప్రసాద్ అంటే: చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.... త్వరలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ లో మ్యూజిక్ కాన్సెర్టులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ టూర్ కు సంబంధించిన వీడియో ప్రోమో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రోమోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.... దేవిశ్రీ ప్రసాద్ మీద పొగర్తల వర్షం కురిపించారు. ఆదివారం మధ్యాహ్నం బయట ఎండలు మండి పోతున్నా... ఇక్కడ చాలా ఆహ్లాదంగా అనిపించింది. ముఖ్యంగా ఇక్కడ ప్రోమో వీడియో చూసిన తర్వాత మరింత ఆహ్లాదంగా ఉంది. అదీ దేవిశ్రీ ప్రసాద్ అంటే. దేవిశ్రీ ప్రసాద్ కు మ్యూజిక్ లవర్స్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన మ్యూజిక్ కాన్సెర్ట్ సాదాసీదా సంగీత విభావరిలా ఉండదు. చాలా ఎలక్ట్రిఫైయింగ్ గా ఉంటుంది అని చిరంజీవి అన్నారు.

దేవిశ్రీకి నో చెప్పలేను

ఈ రోజు ప్రోమో వీడియో ఉంది, మీ చేతుల మీదుగా రిలీజ్ చేయాలంటే వచ్చాను. ఎవరికైనా నో చెప్పాలంటే సంశయించను కానీ, దేవిశ్రీ కి చెప్పలేను. అతడు ఎంతో టాలెంటెడ్. అతడి ఇద్వత చూస్తే ‘నో' చెప్పాలని అని అనిపించదు. చిన్నప్పటి నుండి నాకు తెలుసు. మా ఇంట్లో కుర్రవాడిలాగా అనిపిస్తాడు. నాకు చాలా ఆత్మీయుడు అని చిరంజీవి అన్నారు.

డిఎస్పీ అంటే అతడి పేరే కాదు.. అతడి తీరు కూడా

డిఎస్పీ అంటే అతడి పేరే కాదు.. అతడి తీరు కూడా

డిఎస్పీ అంటే అతడి పేరే కాదు.. అతడి తీరు కూడా... డి అంటే డెడికేషన్. ఎస్ అంటే ఏదైనా సరే స్ట్రాటెజిక్ గా చేస్తాడు. పి అంటే పాపులారిటీ. ఎలా జనాలను ఆకట్టుకోవాలి, వాళ్లని ఎలా అలరించాలి. వాళ్ల మన్ననలు ఎలా పొందాలి. వాళ్లని ఎలా దాసోహం చేసుకోవాలనే విషయంలో నిష్ణాతుడు. ఇతడు మ్యూజిషియన్ కాదు మేజీషయన్ అంటూ చిరంజీవి పొగడ్తల వర్షం కురిపించాడు.

మనకు అలాంటి సత్తా ఉందని నిరూపించాడు

మనకు అలాంటి సత్తా ఉందని నిరూపించాడు

ఇప్పటి వరకు దేశవిదేశాల్లో ఎన్నో మ్యూజిక్ కాన్సెర్టులు చూసాం. గతంలో ఇలాంటి వాటిలో ఎంతో మంది రాణించారు. మనతో శభాస్ అనిపించుకున్నారు. కానీ దేవిశ్రీ దాని ఫిలాసపీని మార్చేసాడు. వెస్ట్రన్ సైడ్ మైఖేల్ జాక్సన్ లాంటి రాక్ స్టార్లను చూస్తుంటాం. అవి చూస్తే చాలా బావుంటుంది. ఇలాంటివి మనకు కుదరదు కదా... వాటి స్థాయికి మనం వెళ్లలేం కదా అనుకునే సమయంలో ఎందుకు చేయకూడదనే ఒక చాలెంజ్ గా తీసుకుని ఇతర ప్రాంతాల్లో ఉండే మన ఇండియన్స్ ని అలరిస్తున్నాడు దేవిశ్రీ. తెలుగు వారు కూడా ఆ స్థాయికి వెళ్లగలరని నిరూపించిన దేవిశ్రీ ప్రసాద్ ను చూస్తే చాలా గర్వంగా ఉంటుంది అని చిరంజీవి అన్నారు.

ఆ డబ్బుతో సేవ చేయడం గ్రేట్

ఆ డబ్బుతో సేవ చేయడం గ్రేట్

దేవిశ్రీ ప్రసాద్ ఒక మ్యూజిక్ వండర్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో దేవిశ్రీ ప్రసాద్ నిర్వహించబోతున్న కాన్సెర్టులు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ కాన్సెర్టుల ద్వారా వచ్చే డబ్బులో కొంత సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్న డిఎస్పీని మనస్తూర్తిగా అభినందిస్తున్నాను అని చిరంజీవి అన్నారు.

English summary
DSP Australia-Newzealand Tour Promo Video Launch By Chiranjeevi. Music composer Devi Sri Prasad, who is all set to perform live in Australia and New Zealand has announced his schedule for the tour. The tour will kick off from May 27 where he'll perform in Sydney at Olympic Park Sports Centre. This will be followed by concerts in Melbourne at Melbourne Convention Centre on June 3, Brisbane in June 10, Sleemans Sports Complex Chandler Theatre in New Zealand. The final concert will be held in Victory Convention Centre in Auckland, New Zealand on June 17.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu