»   » కన్ఫర్మ్: దేవిశ్రీ ప్రసాద్ తో ఇది నాలుగోసారి..

కన్ఫర్మ్: దేవిశ్రీ ప్రసాద్ తో ఇది నాలుగోసారి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బన్నీ,దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన మ్యూజికల్ హిట్స్ చాలా ఉన్నాయి. వీరి కాంబినేషన్ అంటే యూత్ ని పట్టే పాటలుంటాయని అంచనాలు వేస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ కూడా ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ తోనే జర్ని చేస్తున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, జులాయి,అత్తారింటికి దారేది చిత్రాలు మ్యూజికల్ గా ఘన విజయం సాధించాయి. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్,అల్లు అర్జున్ చిత్రానికి మరోసారి దేవిశ్రీప్రసాద్ తోనే ముందుకు వెళ్తున్నారు.


జులాయి ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అల్లు అరవింద్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్‌. కథ ఇప్పటికే సిద్ధమైందట. జనవరి నెలలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. అల్లుఅర్జున్‌ 'రేసుగుర్రం' తుదిదశకు చేరుకొంది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

 DSP confirmed for Trivikram - Bunny film

ఇక అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రేసు గుర్రం'. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. సంక్రాంతికి విడుదల అవుతుందనుకున్న ఈ చిత్రం పిభ్రవరికి వాయిదా పడిందని ట్రేడ్ వర్గాల సమాచారం. చిత్రం పూర్తై ఫస్ట్ కాపీ పట్టటానికి ఇంకా రెండు నెలలు సమయం పట్టేటట్లు ఉందని అందుకే విడుదల ను ముందుకు తోసారని చెప్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంభంధించి ఛేజ్ సీన్ తీస్తారు. అలాగే నెక్ట్స్ షెడ్యూల్ కుంభకోణంలో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి అనేది డల్ సీజన్ కాబట్టి మార్చి చివర నెలలోకి వెళ్లే అవకాసం ఉంది.


ఇక చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నాడు. ఫన్,యాక్షన్ కలిపి మరో కిక్ లా రూపొందిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. సురేంద్రరెడ్డి మాట్లాడుతూ... "పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... 'రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు" అన్నారు.

English summary

 Fourth time, Trivikram and music director Devi Sri Prasad are going to work together. They have teamed up for this new Allu Arjun starrer movie, which will go to the sets early next year. Radhakrishna of Julayi fame is producing the film. Heroine is yet to be finalized.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu