»   » దేవిశ్రీప్రసాద్ ఎమోషన్ అయ్యిన క్షణాలుఆడియో లాంచ్

దేవిశ్రీప్రసాద్ ఎమోషన్ అయ్యిన క్షణాలుఆడియో లాంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ తాజా చిత్రం నాన్నకు ప్రేమతో ఆడియో పంక్షన్ నిన్న ఆదివారం సాయింత్రం విడుదలైంది. ఈ సందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఎమోషనల్ అయ్యారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమా గురించి చేసిన త్యాగం గురించి ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఆయనేం అన్నారో ఇక్కడ స్వయంగా చూడండి.

ఎన్టీఆర్ మాట్లాడుతూ- '' సత్యమూర్తిగారు చనిపోయిన రెండో రోజు దేవీకి మెసేజ్ చే శాను. అతను నాకు పంపించిన రిప్లైలో తన బాధతో పాటు పాటల రికార్డింగ్ స్టేటస్‌ని కూడా మెసేజ్ చేశాడు. మన వల్ల పని డిస్ట్రబ్ కాకూడదని సత్యమూర్తిగారు చెప్పిన మాటను దేవి పాటిస్తుంటాడు. 'నాన్నకు ప్రేమతో' ప్రపంచంలోని తండ్రులందరికీ ఇచ్చే నీరాజనం.'' అన్నారు. ఈ మాటలు అంటున్నప్పుడు దేవిశ్రీప్రసాద్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు.

DSP Gets Emotional During Jr. NTR's Speech

దేవిశ్రీ ప్రసాద్ మట్లాడుతూ- ''30 ఇయర్స్ నుంచి మా నాన్నగారికి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. మా అమ్మ ఆయన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. 'నాన్నకు ప్రేమ'తో పాటలను మా నాన్నగారికి అంకితం చేయడం సంతోషంగా ఉంది'' అన్నారు.

DSP Gets Emotional During Jr. NTR's Speech

ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ : విజరు చక్రవర్తి, ఆర్ట్‌ : రవీందర్‌, ఫైట్స్‌ : పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌ : నవీన్‌ నూలి, పాటలు : చంద్రబోస్‌, డాన్స్‌ : రాజు సుందర కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సుకుమార్‌.

English summary
Music Director Devisriprasad Gets Emotional During Jr. NTR's SpeechNaanku Prematho Audio launch.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu