»   » ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కి దేవిశ్రీప్రసాద్ పోస్టర్

‘సన్నాఫ్ సత్యమూర్తి’ కి దేవిశ్రీప్రసాద్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ రూపొందించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్ కోసం ఓ సాంగ్ ని సిద్దం చేసి ఇప్పటికే టీజర్ కూడా వదిలారు. ఇప్పుడు ఆ సాంగ వీడియో వెర్షన్ కు సంభందించిన పోస్ట్రర్ ని విడుదల చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


గతంలో బన్నీ-త్రివిక్రమ్ కలయికలో వచ్చిన జులాయి కోసం... అప్పట్లో ఓ ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేశారు. బన్నీతో పాటు దేవిశ్రీ ప్రసాద్ చిందేసిన ఆ స్పెషల్ సాంగ్ సినిమా ప్రచారానికి ఎంతో హెల్ప్ అయింది. దీంతో.. ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి కోసం ఇలాంటిదే ఓ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ సిద్ధం చేశారు దేవిశ్రీ.


మరోసారి-బన్నీ-దేవిశ్రీ కలిసి చిందేయనున్న ఈ పాటకు సంబందించి షూట్ కూడా పూర్తయింది.. రేపే ఈ ప్రమోషనల్ సాంగ్ విడుదల చేయబోతున్నారు... ఈ విషయాన్ని ధృవీకరిస్తూ... ఓ టీజర్ కూడా విడుదల చేశారు. కాంబినేషన్ తో పాటు ప్రమోషన్ విషయంలోనూ 'జులాయి'నే ఫాలో అవుతున్న సన్ ఆఫ్ సత్యమూర్తి అదే రేంజి హిట్ ని కొడతారని అంచనాలు వేస్తున్నారు.


DSP poster from Son Of Satyamurthy

ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందిన ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ కథానాయికలుగా నటించారు. నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ త్రివిక్రమ్-అల్లు అర్జున్ మేలుకలయికలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే సూపర్‌హిట్ అయ్యాయన్నారు.


సెన్సార్‌వారు ఎటువంటి కట్స్ లేకుండా అనుమతి ఇచ్చారని, తెలుగు ప్రేక్షకులకు అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, సింధు తులాని, వెనె్నల కిశోర్, రావు రమేష్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:ప్రసాద్ మూరెళ్ల, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్:రవీందర్, నిర్మాత:రాధాకృష్ణ.ఎస్., కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:త్రివిక్రమ్.

English summary
Son of Satyamurthy movie unit released a poster with DSP and Bunny.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu