twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి మరిదే మొట్టమొదటగా, ఫోర్సెనిక్ రిపోర్ట్ లో ఏముంది..దుబాయ్ మీడియాలో కుదుపు!

    |

    Recommended Video

    Dubai Media Highlighting Sridevi News

    శ్రీదేవి మరణం యావత్ సినీ అభిమానులని కలచివేస్తోంది. సమ్మోహనపరిచే అందం, ఆకట్టుకునే నటనతో దశాబ్దాలపాటు అలరించిన శ్రీదేవి ఉన్నపళంగా ఈ లోకాన్ని విడిచిపెట్టడంతో సినీప్రముఖులు, ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి మృతికి ప్రాధమిక కారణం ఆమె కార్డియాక్ అరెస్ట్ కు గురికావడమే. కాగా శ్రీదేవి మృతికి మరేమైనా కారణాలు ఉన్నాయని అనే విషయం తెలియాలంటే ఫోర్సెనిక్ రిపోర్ట్ రావలసిందే.

    మేనల్లుడి పెళ్లి కోసం

    మేనల్లుడి పెళ్లి కోసం

    కొన్ని రోజుల క్రితం శ్రీదేవి కుటుంబం తన మేనల్లుడి వివాహానికి హజాయ్యేందుకు దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ శ్రీదేవి అనుకోని విధంగా మృతేవాత పడ్డారు. తన కుటుంబాన్ని అభిమానులని తీరనిశోకంలో ముంచారు.

    తేరుకునేలోపే అంతా

    తేరుకునేలోపే అంతా

    హోటల్ గదిలోని బాత్ రూమ్ లో శ్రీదేవి కుప్పకూలిపోయారు. బాత్ రూమ్ నుంచి ఎలాంటి అలికిడి లేకేపోవడంతో భర్త బోనీ కపూర్ అప్రమత్తమై ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది.

    మొట్టమొదటగా శ్రీదేవి మరిదే

    మొట్టమొదటగా శ్రీదేవి మరిదే

    శ్రీదేవి మరణ వార్తని మీడియాకు మొట్టమొదట తెలియజేసింది ఆమె మరిది సంజయ్ కపూర్. వారి కుటుంబం మొత్తం ప్రస్తుతం దుబాయ్ లోనే ఉన్నారు. శ్రీదేవి మరణించిన కొద్దీ సేపటి తరువాత సంజయ్ కపూర్ దుబాయ్ లోని ఖలీజ్ టైమ్స్ పత్రికకు ఈ విషయాన్ని తెలియజేసారు.

    తరలింపు పనుల్లో బిజీగా

    తరలింపు పనుల్లో బిజీగా

    సంజయ్ కపూర్ ప్రస్తుతం తన వదిన పార్థివ దేహాన్ని ఇండియా కు తరలించే పనిలో బిజీగా ఉన్నారు. శ్రీదేవి పార్థివ దేహం ముంబైకు చేరుకున్న తరువాత అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

    దుబాయ్ మీడియాలో కుదుపు

    దుబాయ్ మీడియాలో కుదుపు

    శ్రీదేవి మరణ వార్తతో దుబాయ్ మీడియా కుదుపుకు లోనయ్యింది. అక్కడి మీడియా సంస్థల్లో శ్రీదేవి వార్తే ప్రధాన అంశంగా మారింది. శ్రీదేవి జ్ఞాపకాలని దుబాయ్ మీడియా మొత్తం గుర్తుచేసుకుంది.

    శ్రీదేవి నామస్మరణ

    శ్రీదేవి నామస్మరణ

    ఇండియాకు వలె దుబాయ్ మీడియా కూడా శ్రీదేవి నామస్మరణతో మారుమ్రోగిపోయింది. ఆమె సాధించిన విజయలన్ని అక్కడి మీడియా సంస్థల్లో హైలైట్ అయ్యాయి.

     చాందిని గోస్ ఆఫ్

    చాందిని గోస్ ఆఫ్

    దుబాయ్ ప్రముఖ పత్రిక ఖలీజ్ టైమ్స్ లో శ్రీదేవి పెద్ద చిత్రాన్ని ప్రచురించి చాందిని గోస్ ఆఫ్ అనే టైటిల్ కూడా పెట్టేసారు. శ్రీదేవి మారిన వార్తకు ఆ సంస్థ అధికప్రధాన్యత ఇవ్వడం విశేషం.

    50 ఇయర్స్ ఆఫ్ లివింగ్ సినిమాటిక్ డ్రీమ్

    50 ఇయర్స్ ఆఫ్ లివింగ్ సినిమాటిక్ డ్రీమ్

    గల్ఫ్ టైమ్స్ కమ్యూనిటీ పత్రికలో శ్రీదేవి చిత్రాన్ని పేజీ మొత్తం ప్రచురించారు. 50 ఇయర్స్ ఆఫ్ లివింగ్ సినిమాటిక్ డ్రీమ్ అనే హెడ్డింగ్ కూడా పెట్టేసారు. శ్రీదేవి ఖ్యాతి ఖండాంతరాలు దాటిందనేదానికి ఇదే ఉదాహరణ.

    ఫోర్సెనిక్ రిపోర్ట్

    ఫోర్సెనిక్ రిపోర్ట్

    శ్రీదేవి పార్థివ దేహానికి పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఫోర్సెనిక్ రిపోర్ట్ లో ఏముందని విషయం అంతటా ఉత్కంఠగా మారింది. శ్రీదేవి భౌతిక ఖాయాన్ని దుబాయ్ నుంచి తరలిస్తున్న నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. శ్రీదేవి మరణానికి గల పూర్తి కారణాలు త్వరలోనే తెలియనున్నాయి.

    English summary
    Dubai media highlighting Sridevi death news. All section of Dubai media revising Sridevi's life
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X