twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    3 హిట్లు, 30 ప్లాప్‌లు: టాలీవుడ్‌కు డబ్బింగ్ స్ట్రోక్

    By Bojja Kumar
    |

    ఒకప్పడు ఆరు సినిమాలు నాలుగు హిట్లతో కళకళ లాడిన తెలుగు సినిమా పరిశ్రమ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. తెలుగులో వంద సినిమాలు రూపొందితే అందులో కనీసం 10 శాతం కూడా హిట్ సాధించడం కష్టం అవుతోంది. దీంతో 3 హిట్లు, 30 ప్లాపులు అన్నచందంగా తయారైంది ఇండస్ట్రీ పరిస్థితి. ఇదే సమయంలో తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగు సినిమాలను వెక్కినెట్టి హిట్లతో ముందుకు సాగుతుండటం గమనార్హం.

    2011లో ఇప్పటి వరకు దాదాపు 75 తెలుగు సినిమాలు విడుదలైతే, అందులో మంచి విజయం సొంతం చేసుకున్న సినిమాలు కనీసం 5 కూడా లేక పోవడం విచారకరం. ఇప్పటి వరకు 25 డబ్బింగ్ సినిమాలు తెలుగులో విడుదలైతే దాదాపు 15 సినిమాలు సూపర్ హిట్టవ్వడమే కాదు మంచి వసూళ్లు సాధించాయి.

    ఈ సంవత్సరం మొదట్లో అగ్రహీరో బాలయ్య 'పరమ వీర చ్రక" లాంటి భారీ ప్లాపును అందించారు. ఆ తర్వా వచ్చిన యువ హీరోల సినిమాలు శక్తి, బధ్రీనాథ్ లు కూడా అదే భాటలో నడిచాయి. ఇదే బాటలో చాలా తెలుగు సినిమాలు పరాజయం. అదే సమయంలో డబ్బింగ్ సినిమాలు హవా కొనసాగిస్తున్నాయి. రంగం, వాడువీడు, కాంచన, నాపేరు శివ లాంటి సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దీంతో బడా నిర్మాతలు కూడా డబ్బింగ్ సినిమాలను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.

    మరి ఎందుకు ఈ పరిస్థితి అంటే....తమిళ డబ్బింగ్ సినిమాలకు ధీటుగా తెలుగు సినిమాలు ఉండక పోవడమే. డబ్బింగ్ సినిమాలు వైవిద్యమైన కథ, భిన్నమైన మేకింగ్ స్టయిల్, వినూత్నమైన పబ్లిసిటీతో పెద్ద హిట్టయి వసూళ్ల పరంగా దూసుకెలుతుంటే....మన తెలుగు దర్శక నిర్మాతలు పాత ఫార్ములాలనే మళ్లీ మళ్లీ వాడుతుండటంతో పాత చింతకాయ పచ్చడి మాదిరి రుచి పచి లేకుండా ఉంటున్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు మన పొరుగు రాష్ట్రపు పుల్ల కూర సినిమాలను తెగ టేస్ట్ చేస్తున్నారు.

    English summary
    Dubbing Fear In Tollywood, why because some dubbed movies super hit in tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X