»   » మహానటి షూటింగ్‌లో బిజీగా దుల్కర్ సల్మాన్

మహానటి షూటింగ్‌లో బిజీగా దుల్కర్ సల్మాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అలనాటి మేటినటి సావిత్రి బయోపిక్ మూవీ "మహానటి" షూటింగ్ ప్రారంభమై ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొన్న విషయం తెలిసిందే. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్నదత్ "స్వప్న సినిమా" పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత కథలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్వప్న దత్ మాట్లాడుతూ.. "మలయాళ సూపర్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ "మహానటి"లో భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది. నేటి నుంచి హైద్రాబాద్ లోని గండిపేటలో ప్రారంభమయిన తాజా షెడ్యూల్ లో దుల్కర్ పాల్గొన్నారు అని అన్నారు.


Dulquer Salmaan Joined Mahanati Shooting

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న "మహానటి" చిత్రం ఆవిడ అభిమానులకే కాక ప్రతి సినిమా అభిమానిని అలరించే విధంగా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ కి విశేషమైన స్పందన లభించింది" అన్నారు. ఈ లాంగ్ షెడ్యూల్ లో మరింతమంది కీలకపాత్రధారులు కూడా పాల్గొననున్నారు. మిగతా పాత్రధారులు మరియు టెక్నీషియన్ల వివరాలు అతి త్వరలో వెల్లడిచేయనున్నామని దర్శకనిర్మాతలు తెలిపారు!


English summary
Mahanati is one of the highly anticipated films made on the life of greatest actress of all times in both Telugu and Tamil cinema from 1950s-60s Savitri. Heroine Keerthy Suresh is reprising the title character while Samantha is playing the key role in the direction of Nag Ashwin.Malayalam super star Dulquer Salmaan who is roped to play crucial Shivaji Ganeshan’s role has joined Mahanati shooting today in Hyderabad. Director Nag Ashwin is shooting key sequences on Keerthy Suresh and Dulquer Salmaan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more