»   » జనతా హోటల్‌లో నిత్యామీనన్.. సూపర్‌స్టార్ కృష్ణ ఏమన్నారంటే..

జనతా హోటల్‌లో నిత్యామీనన్.. సూపర్‌స్టార్ కృష్ణ ఏమన్నారంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ కొండేటి సమర్పణలో ఎస్కే పిక్చర్స్ సంస్థలో దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ జంటగా తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్న చిత్రానికి " జనతా హోటల్ " అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను మహా శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు.

 జనతా హోటల్ విజయం సాధించాలి.. కృష్ణ

జనతా హోటల్ విజయం సాధించాలి.. కృష్ణ

‘నిర్మాత సురేష్ కొండేటి తెలుగులో చాలా మంచి చిత్రాల్ని నిర్మించారు. ఇప్పుడు తీస్తున్న జనతా హోటల్ కూడా మంచి విజయాన్ని సాధించాలని మనసారా కోరుకుంటున్నాను' అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు.

నా కెరీర్ ప్రారంభమైంది కృష్ణ సంచికతోనే..

నా కెరీర్ ప్రారంభమైంది కృష్ణ సంచికతోనే..

‘జర్నలిస్టుగా నా కెరీర్ ను స్టార్ట్ చేసింది కృష్ణగారి ప్రత్యేక సంచికతోనే. ఈ రోజు మహా శివరాత్రి పర్వదినాన ఆయన చేతులు మీదగా ఫస్ట్ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నా గత చిత్రాలు ప్రేమిస్తే, పిజ్జా, జర్నీ సినిమాలు లానే చక్కటి సినిమా అవుతుంది అని ఆశిస్తున్నాను' అని ఈ సందర్భంగా సురేష్ కొండేటి తెలిపారు.

మంచి కథతో జనతా హోటల్

మంచి కథతో జనతా హోటల్

‘బేసిగ్గా మనిషికి ఏది లభించినా ఇంకా ఇంకా కావాలన్పిస్తుంది. ఒక్క భోజనం విషయంలో కడుపు నిండగానే చాలు అనిపిస్తుంది. ఇలాంటి మంచి పాయింట్ తో తీసిన సినిమా ఇది. ఇటివల విజయవంతంగా సెన్సార్ పూర్తి చేసుకుంది. మార్చి నెలాఖర్లో కాని ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని వెల్లడించారు.

ఉస్తాద్ హోటల్‌కు డబ్బింగ్

ఉస్తాద్ హోటల్‌కు డబ్బింగ్

మలయాళంలో ఘన విజయం సాధించిన ఉస్తాద్ హోటల్‌కు ఈ చిత్రం మాతృక. దీనిని తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడిగా అన్వర్ రషీద్ వ్యవహరించారు. ఈ చిత్రంలో దల్కర్ సల్మాన్, నిత్యా మీనన్, థిలకన్, సిద్దిఖీ తదితరులు నటించారు.

English summary
Dalquer Salmaan, Nitya menon's movie named Janatha Hotel. This motion picture released by Super star Krishna. This movie is produced by Suresh Kondeti.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu