»   » వావ్..! అచ్చుగుద్దినట్టు: మహానటి సావిత్రి భర్త ఫస్ట్‌లుక్

వావ్..! అచ్చుగుద్దినట్టు: మహానటి సావిత్రి భర్త ఫస్ట్‌లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'మహానటి'. నాగ్‌ అశ్విన్ దర్శకుడు. కీర్తి సురేశ్ టైటిల్‌ రోల్‌కు, సమంత ఓ కీలక పాత్రకు ఎంపికయ్యారు. ఈ చిత్రం ముహూర్తం మే 10న జరగనుంది. తొలి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ చిత్రానికిగానూ ఇప్పటికే వెటరన్ యాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, విజయ్‌ దేవరకొండ సంతకం చేశారు.

  జెమినీ గణేశన్ పాత్రలో

  జెమినీ గణేశన్ పాత్రలో

  మిక్కీ జె. మేయర్‌ స్వరాలను సమకూరుస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమా పతాకంపై తెలుగు, తమిళ, మలయాళంలో స్వప్నా దత్ నిర్మిస్తున్నారు. అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

  దుల్క‌ర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా

  దుల్క‌ర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా

  ఇటీవ‌ల టీంతో క‌లిసిన దుల్కర్ పై టీం సభ్యులు కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. అయితే నిన్న రోజు దుల్క‌ర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా టీం ఆయ‌న‌కు స‌డెన్ స‌ర్ ప్రైజ్ ఇచ్చింది. జెమినీ గ‌ణేష‌న్ గెట‌ప్ లో ఉన్న దుల్క‌ర్ స‌ల్మాన్ ఫోటో రివీల్ చేస్తూ బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేసింది. ఈ సంద‌ర్భంగా టీంకి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేశాడు దుల్క‌ర్ స‌ల్మాన్. తెలుగు,తమిళ భాషలలో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జెమినీ గణేషన్ పాత్ర ఎంత కీలకమైందో చెప్పే పని లేదు కదా..!

  Sai Pallavi Is Like Mahanati Savitri : Sai Chand
  లక్స్ యాడ్ కోసం

  లక్స్ యాడ్ కోసం

  సావిత్రి-జెమినీ గణేశన్ కు పెళ్లయిందనే విషయం చాన్నాళ్ల వరకు సమాజానికి తెలీదు. అప్పట్లో లక్స్ యాడ్ కోసం వాళ్లిద్దరూ కలిసి ఫొటో దిగారు. ఆ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జెమినీ గణేశన్ ను తను పెళ్లాడిన విషయాన్ని సావిత్రి బయటపెట్టారు. మరి ఈ ఉదంతం మహానటి సినిమాలో ఉందో లేదో తెలీదు కానీ.. జెమినీ గణేశన్ గా దుల్కర్ లుక్ మాత్రం అదిరిపోయింది.

  నలుగురు భార్యల్లోమహానటి సావిత్రి

  నలుగురు భార్యల్లోమహానటి సావిత్రి

  తమిళసినిమా రంగాన్ని ఏలిన త్రిమూర్తుల్లో జెమినీగణేశన్‌ ఒకరు. మిగితా ఇద్దరు ఎంజిరామచంద్రన్‌, శివాజీ గణేశన్‌లు.ఆయనకు ప్రేమకథా చిత్రాల హీరోగాపేరుంది. ఆయన నలుగురు భార్యల్లోమహానటి సావిత్రి ఒకరు. ప్రముఖ బాలీవుడ్‌నటి రేఖ ఆయన కుమార్తె. ఆయన తన ఎనబయ్యేళ్ల వయస్సులోవ్యక్తిగత కార్యదర్శిని పెళ్ళి చేసుకొని విమర్శల పాలయ్యాడు కూడా. అయితే అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా చివరి రోజుల్లో ఆయన తన మొదటిభార్య వద్ద ఉన్నాడు.

  English summary
  Dulquer Salmaan plays Gemini Ganesan in the upcoming bilingual film based on veteran actor Savitri's life. He is styled just like Gemini Ganesan, and he dons wavy hair and moustache just like the star did.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more