»   » వేరీజ్ ద పొడుగుజుట్టు చారీ...? అదిరిపోయిన దువ్వాడ జగన్నాథం ఫస్ట్ లుక్

వేరీజ్ ద పొడుగుజుట్టు చారీ...? అదిరిపోయిన దువ్వాడ జగన్నాథం ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా 'దువ్వాడ జగన్నాథం' తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడి పాత్రను పోషిస్తున్నాడనే ఒక టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి వదిలిన ప్రీ లుక్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది.

ఈ ప్రీ లుక్ పోస్టర్ లో విభూతి రేఖలు .. ఎర్రతాడుకి కట్టిన రుద్రాక్ష ..కనిపించటం తో దాదాపుగా కథలో అల్లు అర్జున్ ఎలా ఉండబోతున్నాడన్నదానిపై అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్టయ్యింది. ఆర్య, పరుగు వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు తర్వాత అల్లుఅర్జున్... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో చేస్తున్న మూడో చిత్రమిది. అంతే కాకుండా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందనున్న 25వ సినిమా కూడా ఇదే కావడం విశేషం.


DuvvaaDa Jagannaadam first look Released

ఊళ్ళో ఉండి డ్యాన్సులు ఇరగదీసే జగన్నాథం. చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్సులు నేర్చుకుని ఉంటాడు. టీనేజ్ వయసుకి అన్ని రకాల డ్యాన్సుల్లోనూ ప్రావీణ్యం సంపాదించి ఉంటాడు. డబ్బులు రాని, క్రేజ్ లేని క్లాసికల్ డ్యాన్స్ కాకుండా పబ్‌లలో డ్యాన్సులు ఇరగదీయాలని, దేశంలోనే నంబర్ వన్ డిజె అవ్వాలని హైదరాబాద్ వస్తాడు. అయితే బ్రోకర్లు దెబ్బెయ్యడంతో బజారున పడతాడు. ఆ టైంలోనే ఓ హీరోయిన్ హెల్ప్ చే్స్తుంది. ఫేమస్ డిజె అయిపోతాడు. అయితే హెల్ప్ చేసిన అమ్మాయి వళ్ళే బన్నీకి ప్రేమ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని ఎలా ఫేస్ చేశాడు? బన్నీ జీవితం ఇంకా ఎన్ని మలుపులు తిరిగింది అనేది దువ్వాడ జగన్నాథం కథ అంటూ ఒక కథ ఇప్పటికైతే సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.


డిజెగా బన్నీ డ్యాన్సులను ఏ రేంజ్‌లో ఇరగదీసి ఉంటాడో వేరే చెప్పాలా? ప్రస్తుతం కొరియోగ్రాఫర్స్‌తో కలిసి కూర్చుంటున్నాడట హరీష్. ది బెస్ట్ డ్యాన్సులను డిజైన్ చేయిస్తున్నాడట. ఇప్పటి వరకూ వచ్చిన అన్ని తెలుగు సినిమాల్లోకి ది బెస్ట్ డ్యాన్స్...ఈ సినిమాలో ఉంటుందట. 'అదుర్స్'లో ఎన్టీఆర్ ధరించిన బ్రాహ్మణ యువకుడి పాత్రను పోలినదిగా ఈ పాత్ర ఉంటుందట. అసలు ఈ కథను 'అదుర్స్' కి సీక్వెల్ గా ఎన్టీఆర్ తో చేయాలని హరీష్ శంకర్ ప్రయత్నించాడట. కుదరకపోవడంతో అల్లు అర్జున్ కి వినిపించి .. ఆయన చెప్పిన మార్పులు చేర్పులతో రంగంలోకి దిగాడని చెప్పుకుంటున్నారు.


అయితే అదుర్స్ లో ఎన్టీఆర్ నటన ని చూసేసి ఉండటం వల్ల ఇప్పుడు అదే పాత్రని బన్నీ ఎలా చేస్తాడన్న ఆసక్తితో చాలానే ఎదురు చూసారు జనం. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన దువ్వాడ జగన్నాథం ఫస్ట్ లుక్ బయటికి వచ్చేసింది. పాతకాలం నాటి ఎల్లోకలర్ బజాజ్ స్కూటర్ మీద అడ్డనామాలూ పంచెకట్టుతో అచ్చమైన భ్రాహ్మణ యువకుడిలా కనిపిస్తున్నాడు బాన్నీ, అయితే మరీ కాపీ కొట్టేసినట్టుగా ఉంటుదనేమో ఈసారి పోడవు పిలక మాత్రం లేదు. నిజానికి అదుర్స్ లో తారక్ కి డిఫరెంట్ లుక్ తెచ్చింది ఆ పొడవు జుట్టు తలకట్టే. రెండుపక్కలా కూరగాయల బుట్టలతో ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ"రెండో చారీ" మరెన్ని నవ్వులని తీసుకొస్తున్నాడో తెలియాలంటే మరికొన్నాళ్ళు ఆగాల్సిందే.

English summary
Allu arjun, Harish shankar combo "Duvvada Jagannadam" first look poster released To day
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu