»   » బన్నీ160 - పవన్ 260 మధ్యలో వంద తేడా ఉందక్కడ

బన్నీ160 - పవన్ 260 మధ్యలో వంద తేడా ఉందక్కడ

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ ఒకప్పుడు యువహీరోల్లో ఓ మోస్తరు మార్కెట్ ఉన్న నటుడు, యువహీరోల్లో మెరుగు అని పించుకుంటూనే సైలెంట్ గా దూసుకు పోయాడు. దాదాపుగా బన్నీ కంటే ముందు బ్యాచ్ హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాఉలనుకూడా చేరుకునే స్థాయికి వచ్చిన బన్నీ ఒకదశలో పవన్ ని కూడా మార్కెట్ పరంగా ఢీ కొట్టగల రేంజ్ కి వచ్చాడు. యావరేజ్ అనుకున్న సరైనోడు కే 80 కోట్లు దాటాయ్ అంటే బన్నీ స్టామినా ఏంతగా పెరిగిందో చెప్పక్కరలేదు...

పవన్ కి దగ్గరగా

పవన్ కి దగ్గరగా

నిజానికి చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీలో తిరుగులేని స్థానం పవన్ కళ్యాణ్‌దే సినిమా హిట్టా ఫ్లాపా అన్నదానితో సంబందం ఉండదు పవన్ కళ్యాణ్ కి కూడా సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ తో మరోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే ఇదే గ్యాప్ లో సర్రుమంటూ దూసుకొచ్చిన బన్నీ పవన్ కి దగ్గరగా వచ్చేసాడు.


దువ్వాడ జగన్నాథం

దువ్వాడ జగన్నాథం

‘కాటమరాయుడు' టీజర్ యూట్యూబ్ రికార్డుల్ని ‘దువ్వాడ జగన్నాథం' టీజర్ బద్దలు కొట్టేయడం ఇందుకు నిదర్శనం. ‘దువ్వాడ జగన్నాథం' బిజినెస్ సైతం ఇప్పటిదాకా వచ్చిన పవన్ సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ‘డీజే' రిలీజ్ కూడా భారీ స్థాయిలోనే ఉండబోతోందన్నది ఇప్పటికే అందరికీ తెల్సిన సంగతే...


ఓవర్సీస్ విషయంలో

ఓవర్సీస్ విషయంలో

ఐతే డొమెస్టిక్ లెవెల్లో పవన్ కళ్యాణ్‌తో బన్నీ బాగానే ఢీకొడుతున్నాడు కానీ.. ఓవర్సీస్ విషయంలో పవన్‌కు చాలా దూరంలోనే ఉన్నాడు బన్నీ. పవన్ గత సినిమా ‘కాటమరాయుడు' విదేశాల్లో దాదాపు 450-500 మధ్య స్క్రీన్లలో రిలీజవగా.. ‘డీజే' 300 స్క్రీన్లలోనే విడుదలవుతోంది.


పవన్ మూవీతో పోలిస్తే తక్కువ స్క్రీన్లలోనే

పవన్ మూవీతో పోలిస్తే తక్కువ స్క్రీన్లలోనే

బన్నీ కెరీర్లో ఇదే రికార్డు. తెలుగు సినిమాల ఓవర్సీస్ మార్కెట్లో కీలకమైన అమెరికాలో ‘డీజే'ను 160 లొకేషన్లలో రిలీజ్ చేస్తున్నట్లుగా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రకటించింది. ఐతే ‘కాటమరాయుడు' అక్కడ దాదాపు 260 లొకేషన్లలో విడుదలవడం విశేషం. ‘కాటమరాయుడు'తో పోలిస్తే ‘డీజే'కు బజ్ ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఈ సినిమాను పవన్ మూవీతో పోలిస్తే తక్కువ స్క్రీన్లలోనే రిలీజ్ చేస్తుండటం ఆశ్చర్యమే. మరి వసూళ్ల విషయంలో ‘డీజే' జోరు ఎలా ఉంటుందో చూడాలి.English summary
DJ is going to be the biggest release in Allu Arjun’s career in Overseas. The film is all set to release in 300 locations. While it is going to release in more than 160 locations in the USA alone.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu