»   » దువ్వాడ జగన్నాథం పబ్లిక్ టాక్ః అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్.. హరీశ్ టేకింగ్ ‘అదుర్స్’

దువ్వాడ జగన్నాథం పబ్లిక్ టాక్ః అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్.. హరీశ్ టేకింగ్ ‘అదుర్స్’

Written By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా తొలి భాగంగా ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్‌తో ప్రేక్షకులకు జోష్ కలిగించేలా ఉంది. బ్రహ్మణ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా ప్రెష్‌గా కనిపించాడు. అదుర్స్‌లో ఎన్టీఆర్‌ను మరిపించేలా నటించాడు. అయితే ఎన్టీఆర్‌ను మించిన ఫెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అనిపిస్తుంది. బ్రహ్మణ పాత్ర కోసం అర్జున్ కష్టపడిన తీరు..డైలాగ్స్ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కథ అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని తలపిస్తుంది. భూకబ్జా నేపథ్యంగా సాగుతుంది. విజయవాడలో డీజే చిన్నప్పటి కథతో సినిమా ప్రారంభమవుతుంది.

అల్లు అర్జున్ ఎనర్జీ

అల్లు అర్జున్ ఎనర్జీ

- సీటి మార్ పాటలో అల్లు అర్జున్ ఎనర్జీ అదరగొట్టింది. ఆ పాటలో పూజా హెగ్గేతో కలిసి స్టైలిష్ స్టార్ వేసిన స్టెప్పులు మరోసారి బన్నీకి ఎదురులేదనిపించేలా ఉన్నాయి.
- తొలి భాగామంతా వినోదాత్మకంగా సాగుతుంది. అల్లు అర్జున్ కామెడీ టైమింగ్ బాగా ఉంది.
- ఓ పోలీస్ ఆఫీసర్ డీజేను చేరదీసి భయమంటే తెలియని యువకుడిగా పెంచే కాన్సెప్ట్ బాగుంది.
- బన్నీ అండర్ కవర్ ఆపరేషన్ ఎపిసోడ్ ట్విస్ట్ ఆసక్తికరంగా ఆకట్టుకునేలా ఉంటుంది.
సుబ్బరాజు తల్లి ఎపిసోడ్ ఉద్వేగభరితంగా సాగుతుంది..

అల్లు అర్జున్ ఫెర్మార్మెన్స్.. హరీశ్ టేకింగ్..

అల్లు అర్జున్ ఫెర్మార్మెన్స్.. హరీశ్ టేకింగ్..

- కథ రెగ్యులర్, రొటీన్ అయినప్పటికీ అల్లు అర్జున్ ఫెర్ఫార్మెన్స్, హరీశ్ శంకర్ టేకింగ్‌తో ఎక్కడా ఆ ఫీలింగ్ కలుగదు.
- స్టైలిష్ స్టార్ ఫ్రెష్ లుక్స్.. హరీశ్ శంకర్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ
- హరీశ్ శంకర్ రాసిన డైలాగ్స్‌కు థియేటర్లలో అభిమానులు పండుగ చేసుకొన్నారు.

రెండు పాత్రలకు న్యాయం..

రెండు పాత్రలకు న్యాయం..

- గత చిత్రాలతో పోల్చుకుంటే అల్లు అర్జున్ బ్రహ్మణ పాత్ర, అండర్ కవర్ ఆఫీసర్‌గా పూర్తి న్యాయం చేకూర్చాడు.
- ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా సాదాసీదాగా ఉన్నప్పటికీ.. స్టోరి పరిధి మేరకు ఎక్కువ హైప్ చేయకుండా జాగ్రత్త పడ్డారు
- అల్లు అర్జున్ హంగామాతో ఫస్టాఫ్ సరదా సరదాగా గడిచిపోతుంది..

పాటలు.. కెమిస్ట్రీ

పాటలు.. కెమిస్ట్రీ

వివాదాస్పదమైన మడిలో ఓడిలో గుడిలో పాట తెరమీద చాలా బాగా పిక్చరైజ్ చేశారు. సింపుల్ మూవ్‌మెంట్స్‌తో అల్లు అర్జున్, పూజా హెగ్డె ఇరుగదీశారు.
ఈ చిత్రంలో రెండో పాట మెచ్చుకో కోరియోగ్రాఫ్ బాగుంది..
పూజా హెగ్డే బికినీ సీన్ ప్రేక్షకుల్లో కాకపుట్టించింది..బిల్లా చిత్రంలో అనుష్కశెట్టిని మైమరిపించింది.

- మరికొద్ది సేపట్లో పూర్తి రివ్యూ మీకోసం...

English summary
Duvvada Jagannadham movie backdrop is land scam of Agri Diamond. Well picturised songs, good written dialiouges made movie watchable.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu