»   » ఈ డేట్ పక్కా చేసుకోండి... డీజే వచ్చేది ఆరోజే

ఈ డేట్ పక్కా చేసుకోండి... డీజే వచ్చేది ఆరోజే

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం సినిమా రిలీజ్ డేట్ మారినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం ఈ సినిమాను జులై 23 వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని యూనిట్ వర్గాలు ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. మొదట్లో ఈ సినిమాని మే 19న రిలీజ్ చేయాలని భావించారు.

జూన్ 23వ తేదీన

జూన్ 23వ తేదీన

ఈ సినిమాను జూన్ లో విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితమే చెప్పారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఆగస్టుకి వాయిదా పడినట్టుగా కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. దాంతో ఇక లాభం లేదనుకున్నారో ఏమో గానీ అఫీషియల్ గానే చెప్పేసారు. ఈ సినిమాను జూన్ 23వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా, రిలీజ్ డేట్ ను యాడ్ చేసిన ఒక పోస్టర్ ను విడుదల చేశారు.


బ్రాహ్మణ యువకుడి లుక్

బ్రాహ్మణ యువకుడి లుక్

'సరైనోడు' తరువాత బన్నీ చేస్తోన్న సినిమా కావడం వలన .. బ్రాహ్మణ యువకుడి లుక్ తో బన్నీ కనిపించనుండటం వలన .. చాలా గ్యాప్ తరువాత పూజా హెగ్డే చేస్తోన్న సినిమా కావడం వలన .. అందరిలోనూ ఆసక్తి వుంది. ఇప్పటివరకూ కనిపించని వెరైటీ బాడీలాంగ్వేజ్, కొత్తగా ఉన్న డైలాగ్ డెలివరీ కూడా బన్నీ సినిమా మీద మరింత ఆసక్తిని పెంచుతున్నాయ్...


ఇప్పటికే భారీ అంచనాలున్నాయి

ఇప్పటికే భారీ అంచనాలున్నాయి

డీజేపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. బన్నీ ఇందులో డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ 'అదుర్స్' సినిమాలోని చారి పాత్ర టైపు అని చెబుతున్నారు. ఈ పాత్ర ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించడం ఖాయమంటున్నారు. ఈ పాత్రని ఛాలెంజ్ గా తీసుకొన్న బన్నీ.. ప్రత్యేకంగా కసరత్తులు చేశాడని చెబుతున్నారు.


బాహుబలి 2 రానుండటం

బాహుబలి 2 రానుండటం

ఇక, 'డీజే' ని ఎప్పటిలాగే బన్నికి సెంటిమెంట్ గా కలిసొచ్చె ఏప్రిల్ లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. అయితే, అనుకోని కొన్ని అవాంతరాల వల్ల షూటింగ్ కూడా లేట్ అవటం , అంతే కాకుండా బాహుబలి 2 రానుండటంతో.. డీజే జూన్ నెల కి వెళ్లినట్టు చెబుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దిల్ రాజు నిర్మాత.English summary
Stylish Star Allu Arjun’s Duvvada Jagannadham- DJ have officially confirmed the film’s release date. The film will release on June 23rd coinciding with EID festival.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu