»   » డీజే: ఈ ఫోజే అదిరి పోయింది, సాంగ్ సూపర్

డీజే: ఈ ఫోజే అదిరి పోయింది, సాంగ్ సూపర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొన్నటిదాకా బాహుబలి ఫీవర్ తో ఊగిపోయిన టాలీవుడ్ ఇప్పుదిప్పుడే ఆ ప్రభావం నుంచి బయటికి వస్తోంది. ఇప్పటికిప్పుడు వచ్చే మరో రెండు భారీ ప్రాజెక్టు లమీదే ఇప్పుడు అందరి దృష్ఠీ ఉంది. ఒకటి స్పైడర్ అయితే రెండోది అల్లు అర్జున్ DJ దువ్వాడ జగన్నాధం.


వచ్చేనెల అంటే జూన్ 23 న

వచ్చేనెల అంటే జూన్ 23 న

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘డీజే... దువ్వాడ జగన్నాధం' చిత్రం వచ్చేనెల అంటే జూన్ 23 న విడుడల తేదీ ప్రకటించారు. విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ‘డీజే' హడావిడి బాగా ఎక్కువైపోతోంది. ‘డీజే' కి సంబందించిన పబ్లిసిటీ కార్యక్రమాలను స్పీడప్ చేసింది చిత్ర యూనిట్.


 పబ్లిసిటీలో భాగంగా

పబ్లిసిటీలో భాగంగా

ఇక ఆ పబ్లిసిటీలో భాగంగా డీజే పాటలను ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి డైరెక్ట్ గా రిలీజ్ చేస్తూ హడావిడి మొదలు పెట్టేసారు. డీజే ఫస్ట్ సింగల్ ‘శరణం భజే భజే' మార్కెట్ లో హల్చల్ చేస్తుండగానే ఇప్పుడు మరో సర్ప్రైజ్ కి డీజే రెడీ అయ్యింది.‘గుడిలో బడిలో మడిలో' అంటూ సాగే రెండవ పాటని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సోషల్ మీడియా ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


శరణం భజే భజే

శరణం భజే భజే

ఇటీవలే ఈ సినిమా టీజర్ 15 మిలియన్ వ్యూస్ సాధించి భారీ రికార్డుతో హంగామా చేయగా లేటెస్ట్ గా ‘శరణం భజే భజే' అనే మొదటి సాంగ్ కూడా అందరినీ ఎట్రాక్ట్ చేసి సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేసింది.. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని మరో సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.


మోస్ట్ ఫెవరెట్ లిస్ట్ లో

మోస్ట్ ఫెవరెట్ లిస్ట్ లో

‘గుడిలో బడిలో మడిలో' అంటూ సాగే ఈ డ్యూయెట్ కచ్చితంగా అందరినీ మెస్మరైజ్ చేసి మోస్ట్ ఫెవరెట్ లిస్ట్ లో మంచి ప్లేస్ సాధిస్తుందంటున్నారు ,ఈ పాటను దుబాయ్ లోని పలు లొకేషన్స్ లో స్పెషల్ గా చిత్రీకరించారు. మూవీ హైలైట్స్ లో గుడిలో బడిలో సాంగ్ కూడా ఒకటిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.


పూజ హెగ్డే

పూజ హెగ్డే

ఈ పాటకు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయిందని టాక్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇలా పాటలను నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేసి ‘డీజే' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మాత్రం భారీ లెవల్లో చెయ్యడానికి ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్.English summary
The Second single Titled “Gudilo.. Badilo.. madhilo..” from Stylish Star Allu Arjun’s Duvvada Jagannadham will be released today at 6 pm.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu