»   » డీజే క్లైమ్యాక్స్ కి వచ్చేసాడు : దువ్వాడ జగన్నాథం షూట్ చివరికి వచ్చేసిందట

డీజే క్లైమ్యాక్స్ కి వచ్చేసాడు : దువ్వాడ జగన్నాథం షూట్ చివరికి వచ్చేసిందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

డీజే షూటింగ్ 85 శాతం పూర్తయిందని ఇప్పటికే చెప్పిన యూనిట్.. మిగిలిన భాగాన్ని ఈ నెలలోనే పూర్తి చేయనున్నారు.బన్నీ బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ సినిమా మీద అంచనాలు రెట్టింపు చేయగా.. చిత్రయూనిట్ ఇప్పుడు అభిమానులకు ఓ షాక్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది.

డీజే కు క్లైమాక్స్ తో పాటు రెండు పాటలను చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. కీలకమైన క్లైమాక్స్ ను చిన్నపాటి మార్పులతో మరింత అద్భుతంగా తీర్చిదిద్దాడట దర్శకుడు హరీష్ శంకర్. త్వరలోనే డీజే షూటింగ్ ను ప్రారంభించేసి.. ముందుగా క్లైమాక్స్ ను పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత పాటలను కూడా హైద్రాబాద్ లోని స్టూడియోస్ లో సెట్స్ వేసి పిక్చరైజ్ చేస్తారట. మొత్తం వర్క్ అంతా మే నెల చివరినాటికి పూర్తయిపోయేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.


Duvvada Jagannadham to shoot climax scenes soon

షూటింగ్ సమయంలోనే ఈ సినిమాను మే 19న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. సమ్మర్ బరిలో బన్నీకి మంచి రికార్డ్ ఉండటంతో డీజే బన్నీ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. కానీ అభిమానులకు షాక్ ఇస్తూ డీజే సినిమాను రెండు నెలలపాటు వాయిదా వేశారన్న టాక్ వినిపించింది. మరి అన్ని పనులూ ఇప్పుడు అనుకున్న డేట్ కి అయినా పూర్తవుతుందో లేదో చూడాలి.

English summary
The new schedule of Allu Arjun's upcoming 'Duvvada Jagannadham' will begin next month. Its climax scenes and a few songs will be shot in Jaipur.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu