»   » పవన్ కళ్యాణ్ పిల్లలు ఏం చేసారో తెలుసా..?

పవన్ కళ్యాణ్ పిల్లలు ఏం చేసారో తెలుసా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్యా వినాయక చవితి వేడుకలను ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుంటున్నారు. పర్యావరణానికి ఏ మాత్రం హాని చేయని మట్టి వినాయకున్ని స్వయంగా వారే తయారు చేసారు. దీంతో పాటు వినాయకుడి డెకొరేషన్ కూడా ఎలాంటి ప్లాస్టిక్, థర్మకోల్ లాంటి వాడకుండా చేసారు. తన పిల్లలు ఇప్పటి నుండి ఎకో ఫ్రెండ్లీగా ఆలోచించడంపై తల్లి రేణు దేశాయ్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది.

పవన్ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్ ఆయనతో విడిపోయిన తర్వాత తనకు తానుగా ఎదుగేందుకు ప్రయత్నిస్తోంది. ఓ వైపు సినీ నిర్మాణ రంగంలో తన కెరీర్ కు బాటలు వేస్తూనే తల్లిగా పిల్లల పెంపకంలో తనదైన బాధ్యత నిర్వర్తిస్తోంది. పిల్లలే సర్వస్వంగా జీవిస్తోంది.

Ecofriendly Ganpati Bappa made by Akira & Aadya

నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణే తన ఆమె హీరో, ఇప్పుడు మాత్రం కొడుకు అకీరా నందనే నా హీరో అంటోంది రేణు దేశాయ్. అకీరా నందన్, ఆధ్యా ఫోటోలు పోస్టు చేయాలని అభిమానులు కోరడంతో వారి కోరిక మేరకు వారి ఫోటోలు తరచూ పోస్టు చేస్తోంది రేణు. పవన్ కళ్యాణ్‌తో ఉన్నంత కాలం అసలు బయటి ప్రపంచానికి టచ్‌లో లేని రేణు దేశాయ్, విడిపోయిన తర్వాత సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

English summary
"Tiny ecofriendly Ganpati Bappa made by Akira & Aadya :) No thermocol or plastic decorations." Renu desai tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu