»   » షారుక్, గౌరీ ఖాన్, జుహీచావ్లాకు ఈడీ ఝలక్!.. మ్యాటర్ సీరియస్

షారుక్, గౌరీ ఖాన్, జుహీచావ్లాకు ఈడీ ఝలక్!.. మ్యాటర్ సీరియస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, ఆయన సతీమణి గౌరీఖాన్, నటి జుహిచావ్లాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ ముగ్గురు ప్రముఖులు ఐపీఎల్‌కు సంబంధించిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు భాగస్వాములు.

ED notice to Shah Rukh Khan, Gauri Khan and Juhi Chawla

ఈడీ తెలిపిన ప్రకారం 2008లో ఐపీఎల్ జట్టును రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్ మెంట్ కింద జుహిచావ్లాతో కలిసి షారుక్ ఖాన్ కోనుగోలు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి డైరెక్టర్‌గా గౌరీఖాన్ వ్యవహరించారు. ఈ వ్యవహారంలో 40 లక్షల మేర వాటాల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు తలెత్తాయి. ఈ వ్యవహారంలో విచారణ జరుపడానికి వీరికి ఈడీ నోటీసులు జారీ చేసింది.

English summary
ED issues show cause notice to KKR owners Shah Rukh Khan, Gauri Khan and Juhi Chawla for violating FEMA guidelines
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X