twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిల్మ్ ఫెస్టివల్ లో రఘుకుంచె 'ఎడారి వర్షం'

    By Srikanya
    |

    ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా,కేరళ ప్రభుత్వం కలిపి సంయుక్తంగా నిర్వహించే 'సైన్స్' అంతర్జాతీయ లఘుచిత్రోత్సవాల ఫెస్టివల్ లోని ఫోకస్ సెక్షన్లో ఎంపికైన నలబై రెండు చిత్రాలలోని ఫోకస్ సెక్షన్లో స్థానం సంపాదించుకున్న ఏకైన తెలుగు చిత్రం "ఎడారివర్షం". ప్రముఖ సంగీత దర్శకుడు రుఘుకుంచె ప్రధాన పాత్రలో రూపొందిన ఈ లఘు చిత్రం రీసెంట్ గా ప్రదర్శితమై అందరి ప్రశంసలూ అందుకుంటోంది. ఇక తెలుగు ఇండిపెండెంట్ సినిమా బ్యానర్ పై కోఅపరేటివ్ పధ్దతిలో ఒక ఫేస్ బుక్ గ్రూపు నుంచీ కొందరు ఔత్సాహికుల కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17 నుండీ కేరళలోని పాలక్కాడ్ లో ప్రారంభమయ్యే ఈ అంతర్జాయచిత్రోత్సవంలో ప్రదర్శింపబడుతుంది.

    ప్రముఖ కవి, రచయిత బాలగంగాధర్ తిలక్ "ఊరి చివర ఇల్లు" కథ ప్రేరణతో నిర్మించిన ఈ చిత్రానికి కత్తిమహేష్ కుమార్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించారు. రాఘు కుంచె, స్వప్న, ప్రమీలారాణి నటించారు. కెమెరా కమలాకర్, సంగీతం రాజశేఖర శర్మ అందించిన ఈ చిత్రాన్ని దాదాపు ముప్పైమంది కలిసి నిర్మించారు. ఫేస్ బుక్ లో కలిసిన ముప్పై ఎనిమిది మంది నిర్మాతల సహకారంతో ఇది సాధ్యమైందని ఆయన చెప్తున్నారు. రెండున్నర లక్షల బడ్జెట్ లో మూడు రోజుల షూటింగ్ తో ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం రఘుకుంచె ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ రూపొందిస్తున్న దేముడు చేసిన మనుష్యులు చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

    English summary
    Raghu Kunche's 30-minute film Edari Varsham selected for Kerala Film Festival directed by debutant director Kathi Mahesh Kumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X