»   » తప్పు దిద్దుకున్న రాజమౌళి..., అనుష్కని గ్రాఫిక్స్ లో చెక్కారట

తప్పు దిద్దుకున్న రాజమౌళి..., అనుష్కని గ్రాఫిక్స్ లో చెక్కారట

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక్కోసారి మన దృష్టికి రాని చిన్న చిన్న తప్పులే కొంప ముంచుతుంటాయి. ప్రేక్షకులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. 'బాహుబలి-2' పోస్టర్‌లో దర్శకుడు రాజమౌళి దృష్టికి కూడా రాని తప్పును పట్టేశారు నెటిజన్లు. అనుష్క, ప్రభాస్‌ బాణాలు సంధిస్తూ ఉన్న పోస్టర్‌ను ఇటీవలె విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ప్రభాస్ తో పాటు అనుష్క కూడా కనిపించడం వల్ల ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు.

కాకపోతే ఈ పోస్టర్ లో ఓ భారి తప్పు జరిగిపోయింది. ఈ పోస్టర్ లో హీరో, హీరోయిన్లు.. బాణాలని పట్టుకునే విధానం కొత్తగా ఉన్నా... అనుష్క పట్టుకున్న ధనుస్సు పైకి ప్రభాస్ పట్టుకున్న బాణాలు రావడంపై ప్రశ్నలు మొదలవుతున్నాయి. అసలు అలా పట్టుకోవడం అసాధ్యం.

ఇవి గ్రాఫిక్స్ లో అతికించిన బాణాలని తెలిసినా.. మరీ ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారనే విషయం పై సోషల్ మీడియాలో తెగ విమర్శలు వస్తున్నాయి.ఆ వార్తలకు చెక్‌ పెట్టే క్రమంలో జక్కన్న ఆ తప్పును సవరించి కొత్త పోస్టర్‌ను విడుదల చేశాడు. మొత్తానికి ప్రతీ విషయంలోనూ ఎంత జాగ్రత్తగా ఉండాలో రాజమౌళికి ఆ పోస్టర్‌ తెలియజేసిందన్నమాట.

Edited the photoshop mistake in bahubali poster

ఈ విషయం పక్కన పెడితే సైజ్ జీరో తరువాత అనుష్క ఓ రేంజ్ లో వళ్లు చేసిన సంగతి తెలిసిందే. అనుష్క ఫిజిక్ తగ్గితే బాహుబలి 2 బ్యాలెన్స్ వర్క్ చేద్దామని రాజమౌళి చాలా ట్రయ్ చేసాడు. కానీ స్వీటీ ఫిజిక్ రాజమౌళి ఆశించిన మేరకు తగ్గలేదు. మరి, ఈ పోస్టర్‌లో ఇంత నాజూగ్గా ఎలా మారిపోయింది.

దానికి కారణం గ్రాఫిక్స్‌ అని వార్తలు వినబడుతున్నాయి. రాజమౌళి చెప్పిన స్థాయికి సన్నబడడం అనుష్క వల్ల కాలేదట. దీంతో అలాగే షూటింగ్‌ను పూర్తి చేసేశాడట జక్కన్న. ఆ తర్వాత అనుష్కను తెరపై నాజూగ్గా కనిపించేలా చేసే బాధ్యతను గ్రాఫిక్స్‌ టీమ్‌ మీద పెట్టాడట. అనుష్కను వీలైనంత సన్నగా మార్చే పనిలో ప్రస్తుతం గ్రాఫిక్‌ డిజైనర్లు బిజీగా ఉన్నారట. వారి పనితనానికి ఈ పోస్టరే నిదర్శనమని వార్తలు వినిపిస్తున్నాయి.

English summary
RajamauLi Edited the mistake in Prabhas and Anushka Shetty's first-look
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu