»   »  కొత్త హీరోతో ఎడిటర్ మోహన్ రీ ఎంట్రీ...

కొత్త హీరోతో ఎడిటర్ మోహన్ రీ ఎంట్రీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jayam Ravi
ఎడిటర్ మోహన్ అనగానే బ్లాక్ బస్టర్ సినిమాలు 'హిట్లర్, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్' వంటివి గుర్తుకువస్తాయి. ఈ మధ్య ఆయన తమిళంలో బిజీగా ఉండటంతో నిర్మాతగా తెలుగులో సినిమాలు మానేసారు. అందులోనూ తమిళంలో ఆయన కుమారుడు 'జయం' రవి హీరోగా పాపులర్ కాగా, మరో కుమారుడు రాజా ('హనుమాన్ జంక్షన్' దర్శకుడు) డైరక్టర్ గా నిలదొక్కుకున్నారు. కుమారులు లైఫ్ లు సెటిల్ అయ్యాక కూల్ గా ఇప్పుడు తెలుగులో సినిమాను తీద్దామనే నిర్ణయానకి వచ్చారు.

దాంతో దాదాపు యేడేళ్ళ విరామం తర్వాత ఇప్పుడు ఆయన ఓ డిఫెరెంట్ కాన్సెప్ట్ తో కొత్త హీరోను తెలుగు తెరకు పరిచయం చేస్తూ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నిజానకి ఆయన ఆమధ్య 'అగ్గిపిడుగు' టైటిల్ తో తన కుమారులిద్దరితో స్టైయిట్ సినిమా తీద్దామనుకున్నారు. కానీ జయం రవి డేట్స్ బిజీగా ఉండటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. దాంతో కొత్త కుర్రాడిని పరిచయం చేయటమే బెటరనుకుంటున్నరట. స్క్రిప్టు వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. అంటే త్వరలో ఓ మంచి సినిమాను మనం చూడబోతున్నామన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X