»   »  ఎన్టీఆర్‌ సినిమా టైటిల్స్ తో తమాషా పాట

ఎన్టీఆర్‌ సినిమా టైటిల్స్ తో తమాషా పాట

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : తారకరత్న హీరోగా రూపొందుతోన్న చిత్రం 'ఎదురులేని అలెగ్జాండర్'. రాజరెడ్డి దర్శకత్వంలో పోచ లక్ష్మీకాంతరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుతోంది. హైదరాబాద్‌లో హీరో,హీరోయిన్స్ పై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. రాజు నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తారకరత్న మాట్లాడుతూ ''తాతయ్యగారు నటించిన సినిమా పేర్లతో అల్లుకొన్న పాట ఇది. చాలా తమాషాగా సాగుతుంది. మాస్‌కి నచ్చే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము''అన్నారు.

''శక్తిమంతమైన పాత్రలో తారకరత్న కనిపిస్తారు. సంగీతం కూడా ఆకట్టుకొంటుంద''ని దర్శకుడు చెప్పారు. పోచ సాహితి ధనుష్‌రెడ్డి సమర్పిస్తున్న చిత్రం 'ఎదురులేని అలెగ్జాండర్'. పి.ఎల్.కె. ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తారకరత్న కథానాయకుడు. కోమల్ ఝా నాయిక. రవిబాబు కీలక పాత్రధారి. పోచ లక్ష్మికాంత రెడ్డి నిర్మాత. రాజరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని దక్కన్‌పార్కులో జరుగుతోంది.

తారకరత్న మాట్లాడుతూ "వైవిధ్యమైన అంశంతో తెరకెక్కుతున్న సినిమా ఇది. రెండు పాటలు మిగిలున్నాయి. 29కి మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. స్క్రిప్ట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. సాంకేతిక పనితనం, పాటలు మెప్పిస్తాయి'' అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ "నిర్మాత మంచి బడ్జెట్ ఇచ్చారు.

నందమూరి తారకరామారావుగారి సినిమాల పేర్లతో ఓ పాటను సిద్ధం చేసి ఇప్పుడు తారకరత్నపై తెరకెక్కిస్తున్నాం. రాజు మాస్టర్ నృత్యరీతుల్ని సమకూరుస్తున్నారు'' అని అన్నారు. ఈ నెల 27 నుంచి వైజాగ్‌లో పాటల్ని చిత్రీకరిస్తామని రాజు మాస్టర్ తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ "టాకీ, ఫైట్లు పూర్తయ్యాయి. వచ్చేనెల రెండో వారంలో పాటల్ని, మార్చి మొదటివారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: జోశ్యభట్ల, కెమెరా: తోట రమణ; ఫైట్స్: సతీష్, కూర్పు: ప్రవీణ్ పూడి, నృత్యాలు: రాజు, మాటలు: చింత శ్రీనివాస్, పాటలు: భాస్కరభట్ల, వశిష్టశర్మ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజరెడ్డి, నిర్మాత: పోచ లక్ష్మికాంత రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.బాలగంగాధరరెడ్డి.

English summary
Eduruleni Alexander stars Tarak, Kumkam is directed by Panuganti Rajareddy. Kota Srinivasa Rao, Ravi Babu,Vijay etc are starring in the film. Josyabhatla Sarma is the music director.
Please Wait while comments are loading...