»   » కామెడీ గానే ఉంది కానీ... మరీ ఆ టైటిల్ తో హిట్ కొట్టొచ్చా..!?

కామెడీ గానే ఉంది కానీ... మరీ ఆ టైటిల్ తో హిట్ కొట్టొచ్చా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్‌ ఎహే'. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ - ''ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. అతి త్వరలోనే ఆడియో రిలీజ్‌ చేసి, అక్టోబర్‌ 7న విజయదశమి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. క్లాస్‌ని, మాస్‌ని అలరించే ఈ చిత్రం ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. సునీల్‌ కెరీర్‌కి, మా బేనర్‌కి 'ఈడు గోల్డ్‌ ఎహే' మరో సూపర్‌హిట్‌ చిత్రమవుతుంది'' అన్నారు.

లేటెస్ట్ పోస్టర్స్ ని బట్టి ఈడు గోల్డ్ ఎహే చిత్రం థ్రిల్లర్, మాస్,క్లాస్,ఎంటర్ టైనర్ గా తెరకెక్కినట్టు అర్ధమవుతోంది. కొన్నాళ్ళుగా సునీల్ కి సరైన హిట్ లేకపోగా ఈడు గోల్ట్ ఎహే చిత్రాన్ని పెద్ద సినిమాలకు పోటిగా దింపుతున్నాడంటే సినిమాపై పూల రంగడు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు అర్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మూవీ పై హైప్ తేగా సినిమా పక్కా సక్సెస్ అవుతుందని యూనిట్ భావిస్తోంది. సునీల్...డైరెక్టర్ క్రాంతి మాధవ్ సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నట్టు సమాచారమ్.

Eedu Gold Ehe Releasing 7th October

సునీల్‌ సరసన సుష్మారాజ్‌, రిచా పనయ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, పునీత్‌ ఇస్సార్‌, డా. నరేష్‌, అరవింద్‌, చరణ్‌, పృధ్వీ, పోసాని, బెనర్జీ, శత్రు, వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌, ప్రభాస్‌, భరత్‌, అనంత్‌, రాజా రవీంద్ర, లంబోదర, మాస్టర్‌ అక్షిత్‌, నల్లవేణు, గిరిధర్‌, సుదర్శన్‌, విజయ్‌, జోష్‌ రవి, పి.డి.రాజు, పవన్‌, గణేష్‌, కోటేశ్వరరావు, జగన్‌, సత్తెన్న, అవంతిక, బేబి యోధ, లలిత, లక్ష్మి, శ్రీలేఖ, అశోక్‌ తలారి మిగతా పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దేవరాజ్‌, సంగీతం: సాగర్‌ ఎం. శర్మ, ఆర్ట్‌: వివేక్‌ అన్నామలై, ఫైట్స్‌: గణేష్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికిపాటి, కో-ప్రొడ్యూసర్‌: అజయ్‌ సుంకర, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వీరు పోట్ల.

English summary
Sunil starrer movie ‘Eedu Gold Ehe’ release date announced.The movie is getting dressed up for a big release on 7th October 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu