For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'ఈగ' కాపీ ఆరోపణలపై రాజమౌళి వివరణ

  By Srikanya
  |

  హైదరాబాద్: రాజమౌళి తాజా హిట్ చిత్రం 'ఈగ' చిత్రం 'Cockroach'(బొద్దింక) అని షార్ట్ ఫిలిం కాపీ అంటూ నేషనల్ మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... " ఈగ తో 'Cockroach'కి పోలికలు తెస్తున్నారు. నేను ఈ 'ఈగ' చిత్రం చేసే సమయంలో జంతువుల మీద చేసిన అనేకమైన యానిమేషన్ సినిమాలు చూసాను. కుక్క పునర్జన్మ ఎత్తి పగ తీర్చుకోవటం అనే అంశంపై వచ్చిన 'fluke'చూసాను. కాబట్టి ఎవరూ 'Cockroach','fluke' తో కానీ పోల్చవద్దు. నాకు అలాంటి ఆరోపణలు వింటే బాధ కలుగుతుంది. కానీ క్లియర్ గా చెప్పగలను. ఏవన్నా అంశాలు కలిస్తే కేవలం కాకతాళీయమే కానీ కాపీ కాదు..ఈగ ఒరిజనలే ", అన్నారు.

  'ఈగ' ని హిందీలోకి డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో ఈ చిత్రం పై నేషనల్ మీడియాలో రకరకాలు కథనాలు వెలుబడుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ కి చెందిన ఓ పాపులర్ ఇంగ్లీష్ డైలీ ఈ చిత్రం ఓ ఆస్ట్రేలియన్ షార్ట్ పిలిం నుంచి కాపీ చేసి తీసారంటూ రాసుకొచ్చింది. ఆ షార్ట్ పిలిం పేరు 'Cockroach'(బొద్దింక). మార్చి 2010లో వచ్చిన ఈ షార్టి ఫిలిం కథ దర్శకుడు లూక్ ఈవ్ (Luke Eve). ఈ షార్ట్ ఫిలింలో ప్రేమలో ఉన్న ఓ వ్యక్తి చనిపోయి బొద్దింక గా పునర్జన్మ ఎత్తుతాడు. బొద్దింకగా తన గర్ల్ ప్రెండ్ ని కలుసుకుంటాడు. అది ఓ రొమాంటిక్ కామెడీ. అయితే రాజమౌళి తన తండ్రి దాదాపు 15 సంవత్సరాల క్రితమే ఈ కథను తనకు చెప్పారంటున్నారు.

  ఇక ఈ చిత్రం హిందీ వెర్షన్ మక్కి రిలీజ్ తేదిని అక్టోబర్ 12 కి ఫిక్స్ చేసారు. ఈ విషయాన్ని రాజమౌళి ఖరారు చేసినట్లుగా నటుడు సుదీప్ చెప్తున్నారు. ఆయన మాట్లాడుతూ..." ఈగ హిందీ వెర్షన్ అక్టోబర్ 12న విడుదల చేస్తున్నారు. డైరక్టర్ రాజమౌళి ఈ విషయాన్ని ఖారుర చేసారు. ఇది ఓ గ్రేట్ న్యూస్. ఈ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను " అన్నారు. హిందీకి మార్పులు ఏముంటాయి అని మీడియా వారు రాజమౌళిని సంప్రదించినప్పుడు ఆయన మాట్లాడుతూ...ఈగ పాత్ర కోసం అభిషేక్ బచ్చన్ ని సంప్రదించినట్లు చెప్తున్నారు. కానీ అది నిజం కాదు. అలాగే హిందీలో 3D వెర్షన్ ని కూడా విడుదల చేయటంలేదు. అయితే హిందీ ఆడియన్స్ కోసం కొన్ని మార్పులు చేస్తున్నాం. అవేమిటంటే...తెలుగు మాదిరిగానే హిందీలో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ డాన్స్ లను ఈగ చేయటం పెడుతున్నాం అన్నారు.

  ఈగ చిత్రం కథ గురించి రాజమౌళి మాట్లాడుతూ...'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించ లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేసారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్‌ ప్రధాన పాత్రధారులు. సాయి కొర్రపాటి నిర్మాత. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్‌, సమర్పణ: డి.సురేష్‌బాబు.

  English summary
  Rajamouli said that Eega is a unique script but he doesn't have any substantial evidence to prove it. "I was going through several animations films made on animals while making Eega and I came across a film 'fluke', which is about reincarnated dog taking revenge. So no one compares Cockroach and Fluke but it's unfortunate that people draw parallels between Eega and Cockroach. I feel bad when people make such accusations but I can clearly say that it's purely a coincidence and Eega is an original piece", said Rajamouli.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X