»   » రాజమౌళి, కీరవాణి పూజతో....రెండు చిత్రాలు (ఫోటో ఫీచర్)

రాజమౌళి, కీరవాణి పూజతో....రెండు చిత్రాలు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈగ చిత్రంతో ఘన విజయం అందుకుని అందాల రాక్షసి చిత్రంతో అభిరుచి గల నిర్మాతగా తన సత్తాను చాటుకున్న నిర్మాత సాయి కొర్రపాటి. ఆయన వినాయిక చవతి సందర్భంగా తన తదుపరి చిత్రాలను ప్రకటించారు. రాజమౌళి, కీరవాణి ముఖ్య అతిధులగా హాజరయ్యిన ఈ వేడుక ఘనంగా జరిగింది.

వారాహి చలన చిత్రం బ్యానర్ లో వస్తున్న ప్రొడక్షన్ నంబర్ 3, ప్రొడక్షన్ నెంబర్ 4 చిత్రాల పూజా కార్యక్రమాలను వారాహి కార్యాలయంలో నిర్వహించారు. ఈ రెండు చిత్రాలూ క్రియోటివ్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉంటాయని, ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తామని చెప్పారు.

ప్రొడక్షన్ నంబర్ 3 గా తెరకెక్కబోతున్న చిత్రానికి నటుడు, రచయిత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగ శౌర్యం మెయిన్ లీడ్ రోల్ చేస్తూండగా కళ్యాణి కోడూరి సంగీతం అందిస్తున్నారు.

మిగతా విశేషాలు స్లైడ్ షోలో...

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం...

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం...

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైర్ గా అవసరాల శ్రీనివాస్ చిత్రం రూపొందబోతోంది. ఈ చిత్రానికి అనంత్ శ్రీరామ్ సంగీతం అందిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్ ..ఇప్పటికే నటుడుగా సుప్రసిద్దుడు.

ప్రొడక్షన్ నెంబర్ 4 కి...

ప్రొడక్షన్ నెంబర్ 4 కి...

ఈ చిత్రానికి శ్రీనివాస్ గోగినేని దర్శకుడు. కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనరది. ఈ రెండు చిత్రాలకు సిల్లీ మాంక్స్ సినిమా సంస్ధ కో ప్రొడ్యూసర్ గా వ్యవరిస్తుంది.

సాయి కొర్రపాటి మాట్లాడుతూ...

సాయి కొర్రపాటి మాట్లాడుతూ...

మా బ్యానర్ వచ్చే చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైనర్ చేస్తూ ప్రతీ ఒక్కరికీ రీచ్ కావాలనేది మా ఉద్దేస్యం అని తెలిపారు. ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందని చెప్పారు.

వింటూ....

వింటూ....

కీరవాణి, ఆయన భార్య శ్రీ వల్లి...తో నిర్మాత సాయి కొర్రపాటి ఏదో మాట్లాడుతూ ఉంటే వింటూ ఉన్నారు. కీరవాణి గారు అయితే చాలా సీరియస్ గా చెప్పేది వింటున్నారు.

క్రియేటివ్ కపుల్స్...

క్రియేటివ్ కపుల్స్...

రాజమౌళి ఈ పంక్షన్ లో చెక్ లు ఇస్తూ కనిపించారు. ఆయన ప్రోత్సాహంతోనే ఈ బ్యానర్ ముందుకు వెళ్తుంది. రాజమౌళి కి తోడుగా ఆయన భార్య రమాదేవి కూడా హాజరైంది.

కీరవాణి గారు...

కీరవాణి గారు...

కీరవాణి గారు,ఆయన భార్య శ్రీ వల్లి, కళ్యాణ్ కోడూరి ఇలా ఈ పంక్షన్ లో ఉషారుగా కనిపించారు. ఈ ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్స్..అన్నదమ్ములు ఒకే చోట ఇలా కలిసారు.

చెక్ ఇస్తూ...

చెక్ ఇస్తూ...

కీరవాణి గారి ద్వారా సాయికొర్రిపాటి ఈ చెక్ ని మ్యూజిక్ డైరక్టర్ కోడూకి కళ్యాణ్ కి అందించారు. కీరవాణి గారు ఈ చెక్ ఇలా సాయి కొర్రిపాటి నుంచి తీసుకుని ..అలా అందించారు.

వీరంతా..

వీరంతా..

ఈ కార్యక్రమంలో సిల్లీ మాంక్స్ సినిమా సిఇఓ సంజయ్ రెడ్డి, కీరవాణి కుటింబ సభ్యులు, రాజమౌళి కుటుంబ సభ్యులు, అవసరరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రాజమౌళి నవ్వుతూ...

రాజమౌళి నవ్వుతూ...

అవసరాల శ్రీనివాస్ వేసిన జోక్ కి ..సంజయ్ రెడ్డి,రాజమౌళి, సాయి కొర్రపాటి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. రాజమౌళి పూర్తి సహకరిస్తూ ఈ ప్రాజెక్టులకు ముందుకు తీసుకువెళ్తున్నారు.

హీరో కి చెక్ ఇస్తూ...

హీరో కి చెక్ ఇస్తూ...

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో హీరో కి కీరవాణి చెక్ ఇచ్చి ఇలా బెస్టాఫ్ లక్ చెప్తున్నారు. శ్రీవల్లి గారు కూడా ఇలా విషెష్ చెప్తున్నారు.

దర్శకుడుకి చెక్ ఇస్తూ....

దర్శకుడుకి చెక్ ఇస్తూ....

దర్సకుడు కాబోతున్న గోగినేని శ్రీనివాస్ కి రాజమౌళి చెక్ ఇస్తూ ఇలా విషెష్ చెప్తున్నారు. సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు.

బ్యానర్..

బ్యానర్..

వారాహి చలన చిత్రం బ్యానర్ లో వస్తున్న ప్రొడక్షన్ నంబర్ 3, ప్రొడక్షన్ నెంబర్ 4 చిత్రాల పూజా కార్యక్రమాలను వారాహి కార్యాలయంలో నిర్వహించారు. ఈ రెండు చిత్రాలూ క్రియోటివ్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉంటాయని, ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తామని చెప్పారు. ఈ టీమ్ కు ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

English summary
Producer Sai Korrapati who made films like Eega and Andhala Rakshasi today announced two more movies. These two films were launched formally on the occasion of Vinayaka Chavithi festival. Rajamouli, Keeravani and others were present at the pooja ceremony. Actor Srinivas Avasarala directs one film with newcomer Naga Shouriya as the lead actor. Kalyan Koduri will provide the music for this movie. This is rom-com, says Sai Korrapati. The other movie also has new director Srinivas Gogineni. Both these films are co-produced by Silly Monks Cinemas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu