twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఈగ’షూటింగ్ ఆపాను:రాజమౌళి

    By Srikanya
    |

    రాజమౌళి తాజా చిత్రం ఈగ పై తాజాగా ట్వీట్ చేస్తూ...ఈగ క్లైమాక్స్ షూటింగ్ బాగా వస్తోంది. అయితే చాలా టైమ్ తీసుకుంటోంది. యూజవల్ గా నేను రోజుకు ఇవరై ఐదు షాట్స్ తీస్తూంటాను.అయితే దీనికి నేను రోజుకు యావరేజ్ గా పన్నెండు షాట్స్ మాత్రమే తీయగలుతున్నా. రెండు రోజుల పాటు షూటింగ్ ఆపుచేసి షూట్ చేసింది ఎడిట్ చేసి చెక్ చేసుకుంటున్నాను అన్నారు.

    నాని, సమంత కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం ఈగ విజువల్ ఎఫెక్ట్స్ అద్బుతంగా వస్తున్నాయని వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం దాదాబు ఐదు కోట్ల రూపాయలు ఇప్పటివరకూ గ్రాఫిక్స్ కోసం ఖర్చుపెట్టారని విశ్వసనీయ సమాచారం. మొత్తం బడ్జెట్ ఇరవై రెండు కోట్ల వరకూ అవనుందని చెప్తున్నారు.తెలుగులో గ్రాఫిక్స్ పై ఇంత ఖర్చు ఎవరూ పెట్టలేదని చూసేవారికి విజువల్ ట్రీట్ లా ఉండాలని రాజమౌళి ఖర్చుకు వెనకాడకుండా చేస్తున్నాడని చెప్తున్నారు. ఈ చిత్రానికి సెంధిల్ కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.

    'ఈగ"సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ"ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం.

    English summary
    SS Rajamouli tweets as-- “Climax turning out to be good, but it’s taking a lot of time. (I am) able to average only 12 shots a day. Usually I do about 25. Holding the shoot for two days to edit and check.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X