twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉద్యమాల తుఫాన్‌ : చరణ్ ‘తుఫాన్’ పరిస్థితేంటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమ పరిస్థితులు చిలికి చిలికి గాలివాన స్టేజీని దాటి తుఫాన్‌‌లా మారుతున్నాయి. ఇదే తరుణంలో విడుదలకు సిద్ధమవుతోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'తుఫాన్'. రామ్ చరణ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల చేస్తున్నారు.

    సెప్టెంబర్ 6న 'తుఫాన్' సినిమాను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు. అయితే ఏపీలో మాత్రం ఈ సినిమాకు తిప్పలు తప్పేలా లేవని సినిమా ట్రేడ్ వర్గాల అభిప్రాయం. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతంలో మెగాస్టార్ కుటుంబానికి చెందిన హీరోల సినిమాలు ఆడే పరిస్థితులు లేవు. కేంద్ర మంత్రిగా చిరంజీవి వ్యవహార శైలి ఆగ్రహంగా ఉన్న సమైక్య ఉద్యమకారులు ఆయన ఫ్యామిలీలోని హీరోల సినిమాలు అడ్డుకుంటామని హెచ్చరించారు.

    దీంతో రామ్ చరణ్ నటించిన 'ఎవడు', పవన్ కళ్యాన్ నటించని 'అత్తారింటికి దారేది' విడుదల నిలిచి పోయింది. తాజాగా 'తుఫాన్' సినిమా విడుదలైనా సీమాంధ్ర ప్రాంతంలో అడ్డుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో వైపు 'తుఫాన్' సినిమాకు తెలంగాణలోనూ తిప్పలు తప్పేలా లేవు.

    సమైక్యాంద్ర, తెలంగాణ ఉద్యమకారులు హైదరాబాద్ లో సెప్టెంబర్ 7న పోటాపోటీ సభలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రపదేశ్ ఎన్.జి.ఓ ల అసోషియేషన్ సమైక్యాంద్ర పేరుతో హైదరబాద్లో ఒక సభని నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే రోజున తెలంగాణ వాదులు కూడా నగరంలో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 'తుఫాన్' సినిమాపై ఏదో ఒకరకంగా ప్రభావం పడుతుందని అంటున్నారు.

    English summary
    
 Supporters of the Samaikhyandhra and Telangana movements are gearing up for a showdown in Hyderabad on September 7th. This might lead to some tension in the city on that day, as both parties are firm on showcasing their might. Amidst all this, what will happen to Mega Power Star Ram Charan’s ‘Thoofan’? The movie is slated for a release on September 6th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X