»   » నిఖిల్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’... కామెడీ, థ్రిల్లింగ్!

నిఖిల్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’... కామెడీ, థ్రిల్లింగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'స్వామిరారా', 'కార్తికేయ‌', 'సూర్య vs సూర్య' లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో యూత్‌లో యంగ్ఎన‌ర్జిటిక్ స్టార్ గా ఎదిగిన హీరో నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో వ‌స్తున్న చిత్రం 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'. ఈచిత్రంలో నిఖిల్ కి జంట‌గా 21F ఫేం హెబాప‌టేల్ మ‌రియు త‌మిళం లో 'అట్ట‌క‌త్తి', 'ముందాసిప‌త్తి', 'ఎధిర్ నీచ‌ల్' లాంటి వ‌ర‌స సూప‌ర్‌హిట్స్ లో నిటించిన నందిత‌ స్వేత లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇలాంటి క్రేజి ప్రోజెక్ట్ ని 'టైగ‌ర్' ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కిస్తున్నారు. మేఘ‌న ఆర్ట్స్ నిర్మాణంలో మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఢిఫ‌రెంట్ లవ్ స్టోరి ని తెర‌కెక్కిస్తున్నారు. ఈచిత్రానికి సంబందించిన మెద‌టి సాంగ్ ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వినాయక్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఆడియోని ఈ వార‌మే విడుద‌ల చేసి న‌వంబ‌ర్ 18న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

 Ekkadiki Pothavu Chinnavada to release on November 18

ఈ సంధర్బం గా హీరో నిఖిల్ మాట్లాడుతూ " మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఢిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఏక్క‌డికి పోతావు చిన్న‌వాడా చిత్రాన్ని చేశాము. మా టీజ‌ర్ ని చూసిని ప్ర‌తి ఓక్క‌రూ చాలా ఇంట్ర‌స్టింగ్ గా వుంద‌ని చెప్తున్నారు. మా చిత్రం కూడా ఆ రేంజి ఇంట్రెస్ట్ ని క‌లిగిస్తుంది. వినాయ‌క్ గారు చేతుల మీదుగా మా మెద‌టి సాంగ్ విడుద‌ల కావ‌టం చాలా ఆనందంగా వుంది. ఇప్ప‌టికే సెన్సారు కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యుఏ స‌ర్టిఫికేట్ తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌వంబ‌ర్ 18న విడుద‌ల చేస్తున్నాము. శేఖ‌ర్ చంద్ర అందించిన ఆడియో ఈ వార‌మే విడుద‌ల చేస్తాము. ఆద్యంతం న‌వ్వించ‌మే కాకుండా సూపర్ థ్రిల్ వుంటుంది. హెబాప‌టేల్ , నందితా శ్వేత ఎక్స‌లెంట్ గా చేశారు. ఇంకా వెన్నెల కిషోర్ చాలా బాగా న‌వ్వించాడు. నా గ‌త చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. గెట్ రెడి టు థ్రిల్" అని అన్నారు.

ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ మాట్లాడూతూ" ఎక్క‌డికి పోతావు చిన్నివాడా చిత్రానికి సంభందించి ప్ర‌తి విష‌యాన్ని మీడియా వారు చాలా పాజిటివ్ గా తీసుకువెళ్ళారు. మా టీజ‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఈరోజు ద‌ర్శ‌కుడు వినాయక్ గారు చేతుల మీదుగా మా మెద‌టి సాంగ్ ని విడుద‌ల చేశాము. ఆడియో ని అతిత్వ‌ర‌లో విడుద‌ల చేసి చిత్రాన్ని న‌వంబ‌ర్ 18 న విడుదల చేస్తున్నాము. ఎంతో బిజిగా వుండి మా సాంగ్ విడుదల చేసిన వినాయ‌క్ గారికి మా ధ‌న్య‌వాదాలు" అని అన్నారు.

 Ekkadiki Pothavu Chinnavada to release on November 18

నిఖిల్‌, హెబాప‌టేల్‌, నందిత శ్వేత‌(ప‌రిచ‌యం), వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా హ‌ర్ష‌, సుద‌ర్శ‌న్, భ‌ద్ర‌మ్‌, అపూర్వ శ్రీనివాస్ మెద‌ల‌గు వారు న‌టించ‌గా..

పాట‌ల- రామ‌జోగ‌య్య శాస్ట్రి, శ్రీమ‌ణి,
ఆర్ట్‌- రామాంజ‌నేయులు,
ఎడిట‌ర్- చోటా.కె.ప్ర‌సాద్‌,
సంగీతం-శేఖ‌ర్ చంద్ర‌,
మాట‌లు- అబ్బూరి ర‌వి
పి.ఆర్‌.ఓ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశీను
డి.ఓ.పి- సాయి శ్రీరామ్‌,
నిర్మాత‌- మేఘ‌న ఆర్ట్స్‌
స్టోరి, స్క్రీన్‌ప్లే,డైర‌క్ట‌ర్‌- వి.ఐ.ఆనంద్‌.

English summary
Actor Nikhil Siddharth next title Ekkadiki Pothavu Chinnavada is slated for a worldwide release on November 18. The film also cleared its censor hurdles by getting a U/A certificate.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu