మగాళ్ళ మైండ్ సెట్ మారాలంటూ లేడీ ప్రొడ్యూసర్
మగాళ్ల మనస్తత్వమే ఇండియాలో సమస్యగా మారుతోందన్నారు. మగాళ్లు ఏ మాత్రం సామాజిక బాధ్యతతో వ్యవహరించడం లేదని ఆరోపించారు. భారతీయ సంస్కృతి మహిళను అడుగడుగునా అడ్డుకుంటోందని చెప్పారు. జాన్ అబ్రహాం దుస్తులు లేకుండా కనిపిస్తే ఫ్యాషన్‌గా అభివర్ణించేవారు ఓ హీరోయిన్ అదే స్థితిలో తెరపై కనిపిస్తే ఖండిస్తారని మండిపడింది.
దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే తాను 'డర్టీ పిక్చర్'ను తెరకెక్కించానని చెప్పింది. భారతీయ సినిమా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 'సెక్స్, న్యూడిటీ, డ్యాన్స్ నంబర్ అండ్ ద కిస్' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఏక్తా తనదైన శైలిలో మాట్లాడింది. 'ఏక్ థీ దాయన్' చిత్రం గురించి కూడా తప్పుగా ప్రచారం చేస్తున్నారని, అందులో ఎటువంటి మంత్రతంత్రాలు ఉండవని, అది కేవలం ఓ హారర్ చిత్రం మాత్రమేనని చెప్పింది.
నిర్భయ ఘటనను సినిమాల ప్రచారం కోసం వాడుకోవడం లేదని, 'ద బస్ టు హెల్' పేరుతో ఉన్న ఓ బస్సును మాత్రమే ప్రచారం కోసం వినియోగిస్తానని చెప్పింది. దబంగ్-2లో 'ఫెవీకాల్ సే' పాట విమర్శలపాలవడంపై కూడా స్పందించిన ఏక్తా సినిమా మహిళలను గౌరవించేలా ఉందని, ఇలాంటి సినిమాలకు ప్రాధాన్యతనిస్తున్న సల్మాన్, అర్బాజ్‌లను అభినందిస్తున్నానని చెప్పింది.


Click it and Unblock the Notifications












