షారుఖ్ 'చెన్నై ఎక్స్‌ప్రెస్' రిలీజ్ డేట్ ఖరారు
ఈ సినిమా కథలో షారూక్ ..ముంబై నుంచి రామేశ్వరం కు వెళ్లే వ్యక్తిగా కనిపించనున్నారు. రోహిత్ శెట్టి గత చిత్రాలు చూసిన షారూఖ్ ఇంప్రెస్ అయి తన డేట్స్ ఇవ్వటానికి ముందుకు రావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కింది. దర్శకుడు రోహిత్ శెట్టి మాట్లాడుతూ..నిజానికి షారూఖ్ ని ఇంప్రెస్ చేయటం అంత ఈజీ కాదు. ఆయనతో మంచి యాక్షన్ కామెడీ చేయాలనేది నా కోరిక..ఎలా చేసినా షారూఖ్ అభిమానులను అలరించే సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను అంటున్నారు. ఆగస్టు 8న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గాత్రం అందిస్తున్నారు. బాలీవుడ్ బాద్‌షా చిత్రాలకు బాలు ఇంతకుముందెన్నడూ గాత్ర దానం చేసిన దాఖలాలు లేవు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో షారూఖ్, దీపికా పదుకొణెలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను ప్రస్తుతం బాలు ఆలపించడం విశేషం.
షారూఖ్ భార్య గౌరి ఖాన్ నిర్మిస్తున్న 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రానికి విశాల్-శేఖర్లు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్ధాల తరువాత షారూక్‌ఖాన్ చిత్రంలో పాట పాడమని సంగీత దర్శకులు కోరితే బాలు చాలా ఆశ్చర్యపోయారట.


Click it and Unblock the Notifications












