twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పీఎం నరేంద్రమోదీకి షాక్.. ఓటర్లపై ప్రభావం.. ఎన్నికల తర్వాతే..

    |

    Recommended Video

    Election Commission Put A Halt To The Release Date Of Modi Biopic || Filmibeat Telugu

    ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న పీఎం నరేంద్రమోదీ నిర్మాతలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని చేసుకొన్న రిక్వెస్టును ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఏప్రిల్ 17న ఏడుగురు సభ్యులతో కూడిన ఎన్నికల సంఘం అధికారుల బృందం సినిమాను చూసింది. అనంతరం సినిమా రిలీజ్‌ గురించి ఏప్రిల్ 22న నివేదికను ఈసీకి అందజేసింది. ఈ సినిమా రిలీజ్ గురించి ఏమన్నారంటే..

    సెన్సార్ బోర్డు అనుమతిచ్చినా..

    సెన్సార్ బోర్డు అనుమతిచ్చినా..

    పీఎం నరేంద్రమోదీ బయోపిక్‌కు సెన్సార్ బోర్డు ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున సినిమా రిలీజ్‌పై ఆంక్షలు విధించాలని కొందరు కోర్టులో పిటిషన్ వేయడంతో ఎన్నికల సంఘం స్పందించింది. దాంతో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

     పీఎం నరేంద్రమోదీకి మరోసారి ఝలక్

    పీఎం నరేంద్రమోదీకి మరోసారి ఝలక్

    తాజాగా ఈసీ ఆదేశాల ప్రకారం.. పీఎం నరేంద్రమోదీ చిత్రాన్ని మే 19వ తేదీ తర్వాతే రిలీజ్ చేయాలి. లోక్‌సభ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగే ప్రయోజనాలను నిర్మాతలు దృష్టిలో పెట్టుకోవాలి. అందుచేత ఎన్నికలు ముగిసిన తర్వాత సినిమా రిలీజ్‌కు ఏర్పాట్లు చేసుకోవాలి అని ఈసీ తన ఆదేశాల్లో పేర్కొన్నది.

    పీఎం నరేంద్రమోదీ సినిమా బయోపిక్ కాదుని

    పీఎం నరేంద్రమోదీ సినిమా బయోపిక్ కాదుని

    పీఎం నరేంద్రమోదీ సినిమా బయోపిక్ కాదు. రాజకీయ ప్రయోజనాలు ఉద్దేశించి తీసిన చిత్రం (hagiography). అధికార బీజేపీ ప్రభుత్వ ప్రభావం ఎన్నికలపై పడుతుంది. ఓటర్లపై ప్రభావం చూసే అవకాశం కనిపించింది. అందుచేత సినిమాను ఎన్నికలు ముగిసేంత వరకు నిలిపివేయాలని ఈసీ అభిప్రాయపడింది అని ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక తన కథనంలో పేర్కొన్నది.

    ఎన్నికల తర్వాతే రిలీజ్

    ఎన్నికల తర్వాతే రిలీజ్

    ప్రధాని మోదీ జీవితంలోని కీలక అంశాలను తీసుకొని పీఎం నరేంద్రమోదీ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ నటించగా, ఈ సినిమాకు ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదల కావాల్సింది. అయితే రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే కారణంతో ఎన్నికల సంఘం ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది. ఈసీ తాజా ఆదేశాలతో ఈ సినిమా ఎన్నికల తర్వాత రిలీజ్ కానున్నది.

    English summary
    Directed by Omung Kumar, featuring Vivek Oberoi in the role of Prime Minister Narendra Modi, PM Narendra Modi was slated to release on April 11. However the Election Commission put a halt to the release on April 10 itself. The movie might now see the day of the light post elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X