»   » ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సెన్సార్ పూర్తి

‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సెన్సార్ పూర్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుమంత్ హీరోగా చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో చెర్రీ ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై పూదోట సుధీర్‌కుమార్ నిర్మిస్తున్న సినిమా 'ఏమో.. గుర్రం ఎగరావచ్చు.'. పింకీ సావిక నాయిక. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక 11.12.13న బ్యాంకాక్‌లో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు U/A సర్టిపికెట్ జారీ చాసారు. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.

Emo Gurram Egaravachu

జీవితంలో ప్రతి విషయం పద్ధతిగా జరగాలనుకునే అమ్మాయికి, ప్రణాళికలు అవసరం లేదనుకునే అబ్బాయికి మధ్య జరిగే కథే ఈ సినిమా. ఈ కథను ప్రముఖ దర్శకుడు రాజమౌళి సోదరుడు కాంచి అందించగా, మరో సోదరుడు కీరవాణి ఈ సినిమా సంగీతం అందించారు. ఈ సినిమాలో మొత్తం తొమ్మిది పాటలున్నాయి.

నిర్మాత మాట్లాడుతూ "ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. బ్యాంకాక్ కథానాయిక పింకీ సావిక ఫ్యాన్స్ క్లబ్ మా చిత్ర యూనిట్‌కు డిన్నర్ ఇచ్చి భారీగా సత్కరించడం ఆనందంగా ఉంది'' అని అన్నారు. సుమంత్ మాట్లాడుతూ "కీరవాణిగారితో పనిచేయడం ఇదే తొలిసారి. సూపర్బ్ ఆడియో కుదిరింది. ఈ సినిమా కోసం థాయ్ హీరోయిన్‌ని ఎందుకు సెలక్ట్ చేశారని చాలా మంది అడిగారు. ఈ సినిమా చూస్తే వారందరికీ అర్థమవుతుంది. అచ్చం తెలుగమ్మాయిలా ఉంది పింకీ సావిక'' అని అన్నారు.

English summary
Hero Sumanth’s ‘Emo Gurram Egaravachu’ has completed its censor certification formalities and it has received a U/A from the censor board.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu