»   » భయపెట్టే కిరాక్ లుక్‌లో...కిస్సుల హీరో! (ఫోటో)

భయపెట్టే కిరాక్ లుక్‌లో...కిస్సుల హీరో! (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: వరుసగా హాట్ అండ్ సెక్సీ ముద్దు సన్నివేశాల్లో నటిస్తూ.....సీరియల్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ కిస్సుల కింగ్ ఇమ్రాన్ హస్మి త్వరలో ప్రేక్షకులను భయపెట్టే అవతారంలో కనిపించబోతున్నారు. విక్రమ్ భట్ దర్శకత్వంలో 'మిస్టర్ ఎక్స్' చిత్రంలో నటిస్తున్న ఇమ్రాన్ ఫస్ట్ లుక్ విడుదలైనంది.

ఇప్పటి వరకు అందమైన హీరోగా, ముద్దుల హీరోగా అందరినీ ఆకట్టుకున్న ఇమ్రాన్ ఈ చిత్రంలో....వాంతికొచ్చే విధంగా భయంకరమైన లుక్‌లో దర్శనమివ్వడం పలువురు అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. పోస్టర్ చూస్తేనే ఇలా భయపడిపోతున్న అభిమానులు సినిమా థియేటర్లో ఆయన్ను చూసి ఎలా తట్టుకుంటారో? ఏమో?

Emraan Hashmi's new look from Mr X

'మిస్టర్ ఎక్స్' చిత్రం కథాంశం వివరాల్లోకి వెళితే....ఈ చిత్రంలో ఇమ్రాన్ హస్మి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. సమాజంలో అన్యాయాలకు పాల్పడే వారికి తనదైన రీతిలో సమాధానం చెబుతుంటాడు. మరి హీరో ఇలా భయంకరమైన లుక్‌లో ఎందుకు కనిపిస్తున్నాడనేది సస్పెన్స్.

ఈ చిత్రంలో ఇమ్రాన్ హస్మీ సరసన అమైరా దస్తూర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఇదొక భారీ బడ్జెట్ కమర్షియల్ చిత్రమని, బేసికల్‌గా లవ్ స్టోరీ అని, ఇమ్రాన్ హస్మీ నుండి ప్రేక్షకులు ఎలాంటి సీన్లు ఎక్స్ పెక్ట్ చేస్తారో అలాంటి సన్నివేశాలన్నీ ఇందులో ఉంటాయని అంటున్నారు చిత్ర నిర్మాతలు.

English summary
Move over Mr India and Gaayab, Indian cinema is ready to tell the tale of an invisible man again, only this time, it's a cop. Emraan Hashmi has gone for an extreme makeover in his next Mr X. Fans of his mane would be in for a disappointment as he appears bald in the movie's still, released by filmmaker Mahesh Bhatt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu