»   » క్రతినా, కరీనా మధ్య వేడి చల్లారిందా?

క్రతినా, కరీనా మధ్య వేడి చల్లారిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ టాప్ హీరోయిన్లు క్రతినా కైఫ్, కరీనా కపూర్ మధ్య మొన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇండస్ట్రీలో అగ్రస్థానం కోసం పోటీ పడుతున్న ఈ ఇద్దరు....ఒకరిపై ఒకరు సెటైర్లు, విమర్శలు చేసుకున్న సందర్భాలు అనేకం. ఒకరు నటించే సినిమాలో మరొకరు సెకండ్ హీరోయిన్ గా నటించడానికి అస్సలు ఇష్ట పడేవారు కాదు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య చిచ్చు చల్లారినట్లే కనిపిస్తోంది. సల్మాన్ ఖాన్ బాడీగార్డు సినిమాలో ఈ ఇద్దరిలో ఒకరు హీరోయిన్ పాత్ర చేస్తుండగా, మరొకరు ఐటం నెంబర్ గా కనిపించబోతున్నారు. దీనికి తోడు ఇటీవల జరిగిన లాక్మె ఫ్యాషన్ వీక్ లో వీరు..రాసుకుపూసుకు తిరగడంపై వాదనకు బలాన్ని చేకూరుస్తోంది.

ఈ షోలో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులు వేసుకున్న కరీనా..షో టాపర్ గా నిలచింది. ఇదే కార్య్రక్రమానికి గెస్ట్ గా హాజరైంది కత్రినా. ఈ ఇద్దరు మద్దులతో కలిసి ర్యాంప్ వాక్ చేశాడు మనీష్. ఈ సీన్ చూసి ఆ కార్య్రకమానికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు. ఈ సందర్భంగా ఒకరు...మీరిద్దరు మళ్లీ ఫ్రెండ్స్ అయ్యారా? అంటూ క్రతినాను అడగ్గా.. మేము ఎప్పటి నుంచో మంచి స్నేహితులం.. మీకెందుకు ఆ డౌట్ వచ్చిందంటూ ఎదురు ప్రశ్నించిందట అమ్మడు.

దీన్ని బట్టి బాలీవుడ్ లో శాశ్వత మిత్రులు, శాశ్వత శ్రతువులు ఉండనే వాదన వినిపిస్తోంది హిందీ జనాల నుంచి...

English summary
Putting to rest all rumours about their alleged tiff because of Salman Khan's upcoming film "Bodyguard", actresses Kareena Kapoor and Katrina Kaif were seen quite elated in each other's company at the grand finale show of the Lakme Fashion Week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu