twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కదిలింది కృష్ణ-మహేష్ ఫ్యాన్స్

    By Staff
    |

    Mahesh Babu
    తెలుగు సినీ పరిశ్రమలో రాజకీయం వేడెక్కుతోంది. సినీ నటులు ఒక్కొక్కరే తమను ఆదరించే ఒక్కో పార్టీ వైపు మరలి జోరుగా ప్రచారం ప్రారంభంచించారు. అంతేగాక తమ అభిమానులను సైతం తాము మధ్దతిస్తున్న పార్టీకి ప్రచారం చేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర సంక్షేమం కోసం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరొక మారు ముఖ్యమంత్రి కావాలని నిన్నటి తరం సూపర్‌స్టార్‌ కృష్ణ ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం ఐక్యతతో పనిచెయ్యాలని ఆయన తన అభిమానులకు పిలుపునిచ్చారు.

    ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమర్థ నాయకత్వంలో కాంగ్రెస్‌ మాత్రమే స్థిరమైన పరిపాలనను అందించగలదని ఆయన అన్నారు. పద్మాలయా స్టూడియోస్‌ వద్ద 'సూపర్‌ స్టార్‌ కృష్ణ, మహేష్‌ సేన' సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. 'సేన' అధ్యక్షుడు డి.రాంబాబు తొలి సభ్యత్వం పొందారు. జిల్లా శాఖల ప్రతినిధులకు కృష్ణ ద్వారా సభ్యత్వ పుస్తకాల పంపిణీ జరిగింది.

    సూపర్‌ స్టార్‌ అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాజశేఖరరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కచ్చితంగా అమలు చేశారని, మేనిఫెస్టోలో పేర్కొనని కిలో రూ.2 బియ్యం వంటి పథకాలను కూడా ప్రవేశపెట్టారన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం. ప్రజలు కాంగ్రెస్‌ పాలనతో చాలా సంతోషంగా ఉన్నారని, నేతను మార్చాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కృష్ణ తన అభిమానులను ఉత్సాహపరిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనను కృష్ణ భార్య, చలనచిత్ర దర్శకురాలు విజయ నిర్మల కొనియాడారు.

    రాష్ట్ర వ్యాప్తంగా 50 వేలమంది సభ్యులను నమోదు చేసుకుంటామని సూపర్‌ స్టార్‌ కృష్ణ, మహేష్‌ సేన గౌరవ అధ్యక్షులు జి. ఆదిశేషగిరివారు అన్నారు. అక్టోబర్‌ 20న తొలుత తన స్వంత జిల్లా అయిన ఖమ్మంతో ప్రారంభించి అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తానన్నారు. రాష్ట్రంలోని కృష్ణ, మహేష్‌ అభిమాన సంఘాలను ఒకే గొడుకు కిందికి తీసుకువస్తామని డి.రాంబాబు తెలిపారు. ఆయన కూడా పరోక్షంగా చిరంజీవిని విమర్శించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X